Movies"యస్..ఆ హీరోయిన్లని గోకా":.. టాప్ సీక్రేట్స్ ని బయటపెట్టిన జేడీ చక్రవర్తి..!!

“యస్..ఆ హీరోయిన్లని గోకా”:.. టాప్ సీక్రేట్స్ ని బయటపెట్టిన జేడీ చక్రవర్తి..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్న ..విలన్లు ఉన్న ..క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న .. జె.డి చక్రవర్తి పేరు చెప్తే ప్రజలకు అదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. అలాంటి ఓ క్రేజీ స్థానాన్ని సంపాదించుకున్నాడు జెడి చక్రవర్తి . కేవలం హీరో గానే కాదు విలన్ గా మెప్పించిన ఆయన ..ఇప్పుడు చాలా సెలెక్టీవ్ సినిమాలు చేస్తున్నారు . ఒకప్పుడు జెడి చక్రవర్తి అంటే మనందరికీ టక్కన గుర్తొచ్చేది..” మనీ మనీ , గులాబీ , బొంబాయి ప్రియుడు, ఎగిరే పావురమా , హోమం , ప్రేమకు వేళాయరా , సత్య “..వంటి చిత్రాల్లు మెదులుతాయి.

కాగా ప్రజెంట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విభిన్న పాత్రలను చూస్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న జెడి చక్రవర్తి ..తాజాగా హాట్ స్టార్ లో ఓ ఒరిజినల్ లో నటిస్తున్నారు , ఈషా అబ్బా ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ క్రమంలోనే సినీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఈ జంట ఓంకార్ యాంకర్ గా చేస్తున్న “సిక్స్త్ సెన్స్” షోలో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే యాంకర్ ఓంకార్ అడిగిన ప్రశ్న కి జెడి చక్రవర్తి ఇచ్చిన ఆన్సర్ షోకే హైలెట్గా మారింది.

ఈ షోలో బోల్డ్ కామెంట్ చేశారు జెడి చక్రవర్తి. ఇందులో ఓంకార్ మాట్లాడుతూ..” మీరు కెరియర్లో ఎంతోమంది హీరోయిన్లతో నటించారు . ఎప్పుడైనా ..ఎవరినైనా ..ఇంప్రెస్ చేయడానికి ట్రై చేశారా ..? అని ప్రశ్నించాడు”. ఈ క్రమంలోనే దీనికి జే డి చక్రవర్తి అంతే బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చారు . “మా నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను.. నేను అందరి హీరోయిన్ ని ట్రై చేశాను ” అంటూ వెల్లడించారు . దీంతో షోలో కాసేపు నవ్వులు పూయించాయి . ఈ ప్రోమో హైలెట్ గా ట్రెండ్ అవుతుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news