అవును.. అక్కినేని నాగేశ్వరరావుతో నటించనని చెప్పింది..అప్పట్లో అగ్రతారగా వెలుగొందిన నటీమణి. నిజానికి అప్పట్లో అక్కినేని, ఎన్టీఆర్ తెలుగుసినిమా రంగాన్ని శాసించారు. ఇలాంటి సమయంలో వారితో అవకాశం కోసం ఎంతో మంది పరితపించారు. అవకాశం వస్తే..చాలు అన్నట్టుగా.. ఎంతో మంది హీరోయి న్లు ఎగబడేవారు. అయితే.. అందరిదీ ఒకదారి అయితే.. తమిళ కథానాయికే కాకుండా.. తెలుగులోనూ.. ఎన్నో సినిమాల్లో నటించిన జయలలిత స్టయిల్ వేరు.
ఆమె కథ బాగుండడమే కాదు.. హీరోను బట్టి కూడా.. సినిమాకు ఓకే చెప్పేవారు. హీరో ఆమెకు నచ్చకపోతే.. వెంటనే కుదరదని చెప్పేవారట. రెమ్యునరేషన్ విషయం ఎలా ఉన్నా.. కొందరు కథానాయకులతో ఆమె నటించలేదు. తమిళనాట శివాజీ గణేశన్ పక్కన జోడీగా జయలలిత ఒకటిరెండు సినిమాలే నటించారు. తర్వాత కాదనుకున్నారు. అదేవిధంగా తెలుగులోకి వచ్చేసరికి.. అక్కినేనితో చేయనని చెప్పారు.
దీనికి కారణం చెప్పడానికి ముందు.. జయలలిత స్టయిల్ గురించి ప్రస్తావించుకోవాలి. ఆమెకు.. హైటు వెయిటు అన్నీ ఉండాలి. తనకు అభిమాన సంఘం ఎక్కువని పదే పదే చెప్పుకొనేవారు. అందుకే వారి మనసు నొప్పించనని కూడా వెల్లడించేవారు. అభిమాన సంఘాలను హీరోయిన్లు ఎక్కువగా ఆదరించిన వారిలో సావిత్రి తర్వాత.. జయలలిత పోటాపోటీగా ఉండేవారు. అలానే.. తెలుగులోనూ.. అప్పట్లో జయలలితకు అభిమానులు ఎక్కువగా ఉండేవారు.
ఎన్టీఆర్-జయలలిత, శోభన్‌బాబు-జయలలిత జోడీకి పెద్ద ఎత్తున అభిమాన సంఘాలు ఉండేవి. దీంతో వారిని నొప్పించడం ఇష్టంలేని జయలలిత.. కొందరితో తాను నటించడం మానుకుంది. ఇలాంటివారిలో అక్కినేని నాగేశ్వర రావు ఒకరు. అక్కినేని హైట్‌కు.. తనకు సరిపోదని.. ఆమె నిర్మొహమాటంగా చెప్పేవారు. అందుకే.. ఒకటి రెండుసినిమాల్లో నటించినా..తర్వాత మాత్రం నటించలేదు.