ఫైమా.. ఈ పేరుకి కొత్త పరిచయాలు అవసరం లేదు . పటాస్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ కమెడియన్ ..ఆ తర్వాత జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చి టాప్ కంటెస్టెంట్లను సైతం తొక్కేసింది . మరీ ముఖ్యంగా వల్గర్ మాటలు.. డబల్ మీనింగ్ డైలాగుల్లోనూ ధిట్ట అన్న విషయం అందరికీ తెలిసిందే. కామెడీని పండిస్తూనే వల్గారిటీ సృష్టించడంలో ఫైమా ఆరితేరిపోయిన నటి అంటూ కూడా పలువురు చెప్పుకొస్తూ ఉంటారు .
మరీ ముఖ్యంగా జబర్దస్త్ లో ఫైమా చేసే వల్గర్ కామెడీ కంటెంట్ ఏ విధంగా సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . జబర్దస్త్ చేస్తున్నప్పుడే బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫైమా అక్కడ కూడా మంచి కామెడీ టైమింగ్ పండించి వన్ ఆఫ్ ద టాప్ కంటెస్టెంట్ గా నిలిచింది . ఈ క్రమంలోనే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన ఫైమా అటు సోషల్ మీడియాలోనూ ఇటు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ముందుకు దూసుకెళ్తోంది .
ప్రజెంట్ పలు క్రేజీ ప్రాజెక్టుతో బిజీగా ఉంటూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ని కూడా మైంటైన్ చేస్తుంది . ఈ క్రమంలోని బిగ్ బాస్ కి ముందు పటాస్ చేసే కొత్తల్లో ఒక ఎపిసోడ్కి 5000 , 10000 చార్జ్ చేసేదని.. ఇప్పుడు అదే ఫైమా దాదాపు 300000- 40000 ఛార్జ్ చేస్తుందని టాక్ వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా ఫుల్ లెన్త్ స్కిట్ అయితే మాత్రం కచ్చితంగా 50,000 చార్జ్ చేస్తుంది అని తెలుస్తుంది . అంతేకాదు రీసెంట్ కాలంలో ఫైమా కారు కూడా కొనేసిందట. దాదాపు ఇండస్ట్రీలోకి వచ్చి 60-70 లక్షలు వెనక పెట్టినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తరువాత ఫైమా లెవల్ నే మారిపోయింది అంటున్నారు జనాలు..!!