మహానటి అని బిరుదు రాకపోయినా.. లేకపోయినా.. అంజలీదేవి.. మహానటే అంటారు.. ఆనాటి అభిమాను లు. ఆ నాడే కాదు.. ఈ నాడు కూడా.. ఒక అనార్కలి.. ఒక సువర్ణసుందరి, ఒక తాతా మనవడు, బడిపంతులు వంటి సినిమాలు చూస్తే.. అంజలీదేవి వైవిధ్య విశ్వరూపం మనకు తెరపై సాక్షాత్కరిస్తుంది. సినీ రంగంలో కేవలం డ్యాన్సర్‌గా అరంగేట్రం చేసిన అంజలీ దేవి.. తొలినాళ్లలో విలన్ పాత్రలు పోషించారంటే ఆశ్చర్యం వేస్తుంది.
అక్కినేని యువకుడిగా ఉన్న రోజుల్లో దక్కిన అవకాశం కీలు గుర్రం సినిమాలో హీరో. ఈ సినిమాలో అంజ లీదేవి విలన్ పాత్ర పోషించారు. అంతేకాదు.. తర్వాత రెండు మూడు సినిమాల్లోనూ ప్రతినాయకురాలి పాత్రలు పోషించారు. ఇలా మొదలైన అంజలి ప్రస్తానం.. తర్వాత.. సంగీత దర్శకుడు.. ఆదినారాయణ రావుతో పరిచయం అనంతరం.. కీలక మలుపు తిరిగింది.
ఇరువురు కూడా.. ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో కేవలం నటనకు మాత్రమే అంజలీ దేవి పరిమితం కాలేదు. భర్త ఆదినారాయణ రావు ప్రోత్సాహంతో సినీమా నిర్మాతగా కూడా మారారు. అంతేకాదు.. బాలీవుడ్ సినిమాల్లోనూ అంజలీదేవి నటించారు. అయితే.. తొలినాళ్లలో బాలీవుడ్‌లో రెండు మూడు సినిమాల్లో హీరోయిన్‌గా చేసినా..త ర్వాత బాలీవుడ్ అభిరుచులు మారిపోయాయి.
దీంతో హైట్ సమస్య అంజలీదేవిని వెంటాడింది. ఆమె నిజానికి పొట్టిగా ఉంటారు. కేవలం 5 అడుగులు మాత్రమే. నిజానికి సావిత్రి 5.5 అడుగులు అయితే, భానుమతి కూడా 5 అడుగులే. దీంతో వీరు బాలీవుడ్‌లో హిట్ కొట్టలేకపోయారు. ఇదే క్రమంలో అంజలీదేవి రెండు సినిమాలు నటించి హిట్లు కొట్టినా.. తర్వాత హీరోల హైట్‌తో అంజలీదేవిని హీరోయిన్‌గా పోల్చుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆమె.. నెమ్మదిగా విరమించుకున్నారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆదినారాయణరావు.. అంజలి ఒక్క అంగుళం హైట్ ఉండి ఉంటే.. ఈ దేశాన్ని ఏలేసేది! అని చమత్కరించారు.