టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ..నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన ప్రేమాయణం నడుపుతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి . గీత గోవిందం సినిమా ద్వారా జతకట్టిన ఈ జంట ఫస్ట్ సినిమాతోని సూపర్ డూపర్ హిట్ పెయిర్ గా పేరు సంపాదించుకుంది. అంతేకాదు ఆ తర్వాత చేసిన సినిమాలు అలా అలా ఉన్నా కానీ.. ఈ జంట కాంబో మాత్రం క్రేజీగా మారింది .
తెర పైనే కాదు తెర వెనక కూడా వీళ్ల ఇద్దరి జోడి బాగుంది అంటూ జనాలు చెప్పుకొచ్చారు . అంతేకాదు పార్టీలు .. పబ్బులు .. వెకేషన్లు.. టూర్లు అంటూ కలిసి తిరుగుతూ ఉండడంతో ఈ జంట ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు. న్యూ ఇయర్ సందర్భంగా లైవ్ ఇచ్చిన వీడియోలో కృతి రష్మిక మాట్లాడుతున్నప్పుడు విజయ్ దేవరకొండ వాయిస్ వినిపించింది . దీంతో పెళ్లికి ముందే ఈ జంట ఎంజాయ్ చేస్తున్నారు అని కూడా వార్తలు వినిపించాయి.
సీన్ కట్ చేస్తే రష్మిక కనీసం విజయ్ దేవ్రకొండ బత డే కి విష్ కూడా చేయలేదు . ఈ క్రమంలోనే ఇద్దరు విడిపోయారు అంటూ అభిమానులు చెప్పుకుంటున్నారు. అయితే విజయ్ దేవరకొండ రష్మిక ఎంత అన్యోన్యంగా ఉన్నారు కదా మరి ఎందుకు విడిపోయారు ..? అనేది ఫ్యాన్స్ కి అర్ధం కావడం లేదు. అయితే వాళ్ళు బాలీవుడ్ లో..
ఓ Party అటెండ్ అయ్యారని అక్కడే వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయని .. ఆ పార్టీలో విజయ్ దేవరకొండ రష్మిక గట్టిగా అరుచుకున్నారని.. ఆకారణంగానే వీళ్లిద్దరు విడిపోయారు అంటూ ఓ న్యూస్ బాలీవుడ్ మీడియాలో సర్కులేట్ అవుతుంది . అంతేకాదు ఈ మధ్యకాలంలో విజయ్ దేవరకొండ – సమంతతో బాగా మింగిల్ అవుతున్నాడట . ఆ విషయంగానే వీరి ఇద్దరి మధ్య ఫైట్ కి కారణం అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు . చూడాలి మరి దీనిపై రష్మిక – విజయ్ దేవరకొండ ఏ విధంగా స్పందిస్తారో..?