Newsరష్మిక-విజయ్ దేవరకొండలను విడిపోవడానికి కారణం ఆమెనా..? అంత దారుణంగా బీహేవ్ చేసిందా..?

రష్మిక-విజయ్ దేవరకొండలను విడిపోవడానికి కారణం ఆమెనా..? అంత దారుణంగా బీహేవ్ చేసిందా..?

సినిమా ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా పెళ్లిచూపులు సినిమాతో క్లాసిక్ హీరోగా పేరు సంపాదించుకొని సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న విజయ్ దేవరకొండ ..ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా తన ఫేట్ మార్చేసుకున్నాడు . సినిమా ఇండస్ట్రీలు అప్పటివరకు టాప్ హీరోలుగా ఉన్న హీరోల అందరి ఫాన్స్ కూడా అర్జున్ రెడ్డి సినిమాను సపోర్ట్ చేస్తూ విజయ్ దేవరకొండకు ఓవర్ హైప్ ఇచ్చేశారు . ఈ క్రమంలోనే ఇప్పటికీ అర్జున్ రెడ్డికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే ఆ క్రేజ్ తో అవకాశాలు దక్కించుకుంటున్నాడు విజయ్ దేవరకొండ.

ఆ తర్వాత గీత గోవిందం సినిమాతో మరో సంచలనానికి తెరలేపాడు విజయ్ దేవరకొండ . ఈ సినిమాలో రష్మిక మందనతో రొమాన్స్ చేసి అందరి జనాలకు షాక్ ఇచ్చాడు . ఈ సినిమాలో వీళ్ళు రొమాన్స్ బాగా పడడంతో వీళ్ళు నిజంగానే లవ్ లో ఉన్నారు అంటూ జనాలు ఫిక్స్ అయిపోయారు . ఆ తర్వాత చేసిన సినిమాల్లోనూ అదే హై రేంజ్ పెర్ఫార్మెన్స్ ఉండడంతో ఈ జంట సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యారు . వీళ్లు కొన్నిసార్లు మీడియా కంటికి చిక్కిపోయారు అంటూ కూడా వార్తలు వినిపించాయి . అయితే గత కొంతకాలంగా రష్మిక మందన – విజయ్ దేవరకొండ కలవట్లేదు..

ఎక్కడ వీళ్ళకి సంబంధించిన వీడియోస్ కనిపించట్లేదు ..అంతేకాదు రష్మిక గాని విజయ్ గాని ఒకరికి సంబంధించిన పోస్టులు ఒకరు పెట్టడం లేదు . దీంతో ఈ జంట విడిపోయారు అన్న న్యూస్ వైరల్ అయింది . అంతేకాదు రష్మిక – విజయ్ దేవరకొండ విడిపోవడానికి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఉన్న సమంతనే కారణమంటూ కూడా ట్రెండ్ అయింది . ప్రెసెంట్ విజయ్ – సమంత హీరోయిన్గా నటిస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ క్రమంలోనే ఆమెకు దగ్గర అయ్యాడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ క్రమంలోని రష్మికను దూరం పెట్టాడట. దీంతో ఒక్కసారిగా మండిపోయిన రష్మిక మరో హీరోకి దగ్గరవుతూ విజయ్ ని దూరం పెట్టింది అన్న న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై ఇప్పటివరకు రష్మిక – విజయ్ దేవరకొండ స్పందించకపోవడం గమనార్హం. నిజంగానే వీళ్ళు విడిపోయారా ..? లేదు దూరంగా ఉండి ప్రేమను పెంచుకుంటున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా ఇలాంటి కామెంట్స్ పై వీళ్ళు ఆన్సర్ ఇస్తేనే బాగుంటుంది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news