చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకి గతంలో మాదిరిగా లైఫ్ స్పాన్ ఉండటం లేదు. చాలావరకూ తగ్గిపోయింది. సముద్రపు కెరటంలా దూసుకొచ్చిన హీరోయిన్లుకు కూడా ఒకే ఒక్క ఫ్లాప్‌తో కనుమరుగైపోతున్నారు. ఇక్కడ అందాల ఆరబోత మాత్రమే ఉంటే సరిపోదు. నటనలో ఏ పాత్రలో అయినా జీవించే టాలెంట్ ఉండాలి. ఇటీవల కాలంలో ఇండస్ట్రీకి హీరోయిన్లుగా వచ్చిన వారు మాత్రం నటన కంటే అందాలనే నమ్ముకుంటున్నారు.
హీరోతో బెడ్రూం సీన్స్..డీప్ లిప్ కిస్సులున్నాయా..బికినీ వేసి రచ్చ లేపాలా..ఇలా సినిమా కథ గురించి కాకుండా ఈ తరం వాటి గురించే ఎక్కువ ఆలోచించి సినిమాలు ఒప్పుకుంటున్నారు. కాస్త స్టార్ డమ్ వచ్చిన హీరోయిన్లు అయితే కథ ఎలా ఉన్నా ? ఒక్కోదానికి ఆదనపు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. మేకర్స్‌కి కావాల్సింది హీరోయిన్ చెప్పింది చేయడం.
అలా చేసే హీరోయిన్లనే మన దర్శక నిర్మాతలు బాగా తీసుకుంటున్నారు. కానీ, వాళ్ళూ ఎక్కువ సినిమాలు చేయడం లేదు. పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో ఎలా సాగిందో ? మనందరికీ తెలిసిందే. మనవాళ్ళు ఎంకరేజ్ చేయడంతో ఆమె ఏకంగా బికినీ కూడా వేసి అలరించింది. ఆ తర్వాత తన అందాలను ఆరబోస్తూ పాన్ ఇండియ హీరోయిన్‌గా మారింది. ఇక రష్మిక మందన్న కూడా కమర్షియల్ హీరోయిన్‌గా సక్సెస్ కావడానికి అన్నీ చూపించింది.
కీర్తి సురేష్ కూడా తన పంథాను మార్చేసి అందాల విందు బాగానే చేస్తుంది. తన హట్ అందాలను చూపించి వేడెక్కించింది. కానీ..ఈ స్టార్ హీరోయిన్లకు ఇప్పుడు ఆశించిన అవకాశాలు దక్కడం లేదు. వీరే కాదు, యంగ్ హీరోయిన్‌లు శ్రీలీల, కృతిశెట్టిల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. అందాలు ఆరబోసినా కూడా వారికి విజయలు దక్కక అల్లాడిపోతున్నారు.