Moviesమహేశ్ బాబు ఎందుకు ఎక్కువుగా ఫంక్షన్లకి వెళ్ళరో తెలుసా..? అలాంటి జబ్బు...

మహేశ్ బాబు ఎందుకు ఎక్కువుగా ఫంక్షన్లకి వెళ్ళరో తెలుసా..? అలాంటి జబ్బు ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా.. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోలుగా పేరు సంపాదించుకున్న ..మహేష్ బాబు అంటే అందరికీ అదోరకమైన ఇష్టం.. తెలియని గౌరవం ..ఆయనను ఓ హీరోలా కాకుండా మన ఇంట్లోని సొంత మనిషిలా భావిస్తూ ఉంటారు . మహేష్ బాబు కూడా అంతే. కాంట్రవర్షియల్ జోలికి వెళ్లకుండా.. చాలా సరదా సరదాగా సినిమాలను తరికేక్కిస్తూ అంతే సరదాగా సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటారు .

కాగా రీసెంట్గా మహేష్ బాబుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మహేష్ బాబు మొదటి నుంచి ఫంక్షన్లకు ఎక్కువగా వెళ్ళరట . బయట ఫంక్షన్లే కాదు సొంత ఇంట్లోని ఫంక్షన్లకు కూడా చాలా దూరంగా ఉంటారట . దానికి మెయిన్ రీజన్ “ఆయనకు మొహమాటం ఎక్కువ” అని ..కూల్ గా..క్లాసిక్ గా.. ప్రశాంతంగా ఉండడానికి ఇష్టపడతారని తెలుస్తుంది .

అంతేకాదు నమ్రతకి అయితే ఫంక్షన్స్ కి వెళ్ళాలని..బాగా తిరగాలని.. బయట చిల్ అవుట్ అవుతూ ఎంజాయ్ చేయాలని కోరిక ఎక్కువగా ఉంటుందట. ఈ క్రమంలోనే ఏదైనా ఫంక్షన్ కి నమ్రత పిలిచినా సరే మహేష్ బాబు మొహమాటంగా వస్తాడు తప్పిస్తే..ఇష్టంగా రాడట. అన్ని ఫంక్షన్లకు రానని ముందే చెప్పేస్తాడట . బాగా దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు ఇక తప్పక వెళ్లాల్సిన ఈవెంట్లకి ఫంక్షన్లకి వెళ్తూ ఉంటాడట . మనం ఎక్కువగా గమనించినట్లయితే మహేష్ బాబు ఏ ఈవెంట్లలో కూడా ఎక్కువ హంగామా చేయరు . తన పని తాను చేసుకుని పోతూ ఉంటారు. రియల్లీ ఇలాంటి ఓ హీరో మన ఇండస్ట్రీలో ఉండడం మన ఇండస్ట్రీకే గర్వకారణం అని చెప్పాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news