Movies" ఫైనల్లీ.. నేను అనుకునిందే జరిగింది"..సమంత పిచ్చ హ్యాపీగా ఉండటానికి కారణం...

” ఫైనల్లీ.. నేను అనుకునిందే జరిగింది”..సమంత పిచ్చ హ్యాపీగా ఉండటానికి కారణం అదేనా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తనదైన స్టైల్ లో సినిమాలో నటిస్తూనే క్రేజీ క్రేజీ ఆఫర్స్ పట్టేస్తూ వెబ్ సిరీస్లకు సైన్ చేస్తూ ..ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్గా దూసుకుపోతుంది . తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది. 36వ పుట్టినరోజు వేడుకలను సమంత చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో సెలబ్రేట్ చేసుకుంది .

దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అందాల ముద్దుగుమ్మ . ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇచ్చింది . “పుట్టినరోజున సింపుల్ రూల్స్ .. సర్ప్రైజ్ లు కాదు.. కేక్స్ కాదు ..హంగామా లేదు.. బెలూన్స్ కాదు.. నేను కోరుకున్నది నాకు స్పష్టంగా లభించింది.. అందుకు ఐ యామ్ సో హ్యాపీ “అంటూ రాసుకొచ్చింది.

ఈ క్రమంలోనే సమంత ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ నుంచి ప్రేమ కోరుకుంటుందని .. ఆ ప్రేమ తనకు దక్కిందని.. అందుకే హ్యాపీగా ఉందని చెప్పుకుంటున్నారు జనాలు. అంతే కాదు ఫ్రెండ్స్ తనకి బర్తడే ను సెలబ్రేట్ చేస్తే.. సిటాడల్ వెబ్ సిరీస్ షూట్ లో కూడా అమ్మడుకి స్పెషల్ బర్తడే విషెస్ అందించారు . ఈ క్రమంలోనే సమంత షేర్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news