ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో నిహారిక విడాకుల వార్త ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు కూతురు నిహారిక జొన్నలగడ్డ చైతన్య ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే . కాగా కొన్ని వారాల నుంచి సోషల్ మీడియాలో ఆమె విడాకులు తీసుకోబోతుంది అన్న న్యూస్ వైరల్ అవుతుంది. ఇద్దరు ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేసుకోవడం .. పెళ్లికి సంబంధించిన ఫోటోలను డిలీట్ చేయడం ..ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తుంది.
కాగా నిహారిక ఇలాంటి విషయాలను ఏం పట్టించుకోకుండా సోషల్ మీడియాలో తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది . కొత్తగా పింక్ ఎలిఫెంట్ పిక్స్చర్స్ అంటూ ఆఫీస్ స్టార్ట్ చేసి పలు సినిమాలు నిర్మిస్తున్న నిహారిక జిమ్‌లో ఎక్కువ టైమ్. స్పెండ్ చేస్తుంది మరీ ముఖ్యంగా రీసెంట్గా నిహారిక జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న వీడియోకు కొన్ని మోటివేషనల్ కోట్స్ యాడ్ చేసింది. ఈ క్రమంలోనే “మనసుకు అయిన గాయానికి కాలమే ముందు ” అంటూ చాలా ఎమోషనల్ నోట్ షేర్ చేసింది .
దీనితో దీంతో జొన్నలగడ్డ చైతన్య – నిహారిక మనసును బాధపెట్టాడని.. అందుకే ఆమె విడాకులు తీసుకున్నారు అని మెగా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి అని నిహారిక చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని అందుకే ఇలాంటి ట్రోలింగ్‌ని కూడా తట్టుకొని తన పేరుని ఇండస్ట్రీలోకి మారు మ్రోగి పోయేలా చేసుకోవడానికి సొంత కాళ్లపై నిలబడుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైనా సరే నిహారిక తీసుకున్న ఈ నిర్ణయం కొందరు మంచిదే అంటుంటే ..మరి కొందరు నెగిటివ్‌గా ఆమెను ట్రోల్ చేస్తున్నారు..!!