ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అక్కినేని నాగచైతన్య పేరే ఓ రేంజ్ లో మారు మ్రోగి పోతుంది . దానికి కారణం ఆయన చేస్తున్న హాట్ హాట్ కామెంట్స్ అని తెలుస్తుంది . మరి ముఖ్యంగా ఆయన రీసెంట్ గా నటిస్తున్న “కస్టడి” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి హైప్ ని బజని క్రియేట్ చేయడానికి తన పర్సనల్.. ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన విషయాల పై కూడా ఓపెన్ అప్ అవుతున్నాడు నాగచైతన్య.
ఈ క్రమంలోనే సమంత తో విడాకుల పై ఓపెన్ అప్ అయ్యాడు. “మేము విడాకులు తీసుకుంది సోషల్ మీడియా కారణంగానే ” అంటూ బల్ల గుద్దిన్నట్లు చెప్పేసిన నాగచైతన్య.. రీసెంట్గా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో తన ఫస్ట్ కిస్ పై ఓపెన్ అప్ అయ్యాడు. ” కస్టడీ ” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్యకి ఫస్ట్ కిస్ పై ప్రశ్న ఎదురైంది.
ఈ క్రమంలోనే నాగచైతన్య మాట్లాడుతూ ..”ఆఫ్ స్క్రీన్ లో నా ఫస్ట్ కిస్ ఎవరితోనో చెప్పను ..కానీ ఆన్ స్క్రీన్ లో మాత్రం “ఏ మాయ చేసావే” సినిమాలోనే.. అది సమంతతోనే అంటూ ఓపెన్ అప్ అయిపోయాడు . అంతే కాదు ఈ సినిమాలో నిజంగా సమంత – నాగచైతన్య ల మధ్య రొమాన్స్ బాగా పండింది. ఫస్ట్ సినిమాతోనే ఇంత హాట్ రొమాన్స్ చేశారు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. మరి ముఖ్యంగా సమంత ఇంత రొమాంటికా..? అంటూ ఆశ్చర్యపోయారు. ప్రజెంట్ నాగచైతన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!