సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నా ..కొత్త హీరోయిన్స్ వస్తున్న ..ఒకప్పటి మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి కి ఎవరు సాటిరారు అని చెప్పాలి . సినిమా ఇండస్ట్రిలో తనదైన స్టైల్ నటించి మహానటిగా గుర్తింపు సంపాదించుకున్న సావిత్రి లైఫ్ జర్నీ ఎలా కొనసాగిందో ఎలా స్టార్ట్ అయిందో.. రీసెంట్ గానే మహానటి సినిమాతో మనకి తెలియజేశారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహానటి సావిత్రికి సంబంధించిన ఎన్నో విషయాలు ఇంకా జనాలకి పూర్తిగా తెలియదు .
అలాంటి ఓ విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మనకు తెలిసిందే మహానటిగా పేరు సంపాదించుకున్న సావిత్రి.. జెమినీ గణేష్ న్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అఫ్కోర్స్ మొదటి భార్య ఉంది అని తెలిసినా కూడా ఆయన మీద ప్రేమ పుట్టడంతో ..ఆ ప్రేమను చంపుకోలేక ..రెండో పెళ్లి చేసుకు పిల్లలను కన్నింది. ఈ విషయం పక్కన పెడితే సావిత్రిని కూడా ఓ డైరెక్టర్ ప్రాణంగా ప్రేమించాడట . ఎంతలా అంటే ఆమె కోసం ప్రాణాలు కూడా తీసుకునే అంతలా బాధపడ్డారట.
ఆ డైరెక్టర్ మరెవరో కాదు తమిళ ఇండస్ట్రీలో స్టార్ట్ డైరెక్ట్ గా పేరు సంపాదించుకున్న “పిళ్లై” . అయితే సావిత్రి మాత్రం ఆయనపై అలా ఊహించుకోలేదట. గుమ్మడి గారితో చెప్పి ” సావిత్రి ని పెళ్లి చేసుకుంటానని చెప్పమన్నారట “. అయితే గుమ్మడి గారు కి అప్పటికే సావిత్రి-జెమిని గణేశన్ ప్రేమ విషయం తెలుసు.. అందుకే ఆమెను మర్చిపో అంటూ సజిస్ట్ చేశారట. సావిత్రిని మర్చిపోలేక ఏకంగా సినిమాలకే దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట పిళ్లై. అంతేకాదు సినిమాలను వదిలేసి తన సొంత ఊరికి వెళ్లి నానా కష్టాలు పడ్డారట . ఇలా సావిత్రి ప్రేమించలేదన్న కోపంతో తన కెరీర్ ని తానే నాశనం చేసుకున్నాడు . ఈ విషయాన్ని గుమ్మడి తన పుస్తకంలో రాసుకొచ్చారు ..!!