సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లకి మించిన రేంజ్ లో క్రేజ్ తో దూసుకుపోతుంది యాంకర్ రష్మీ . అమ్మడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలో ఏదో చించేద్దాం పొడి చేద్దాం అని వచ్చి ఇండస్ట్రీలో జరిగే అవకతవకలకు తట్టుకోలేక వాటి బాధలను భరించలేక బుల్లితెరపై యాంకర్ గా సెటిలైంది . బుల్లితెర పై స్టార్ సెలబ్రిటీ గానే గుర్తింపు సంపాదించుకున్న రష్మీ పలు షోస్ తో బిజీగా ఉంది . రీసెంట్గా రష్మీ హోస్ట్ చేస్తున్న శ్రీదేవి డ్రామా కంపెనీకి సంబంధించిన నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ హైలెట్గా నిలిచింది రష్మి. కాగా ఈ క్రమంలోనే తమ జీవితంలో జరిగే విషయాలు సక్సెస్ అవుతాయా లేదా అని తెలుసుకోవడానికి ఓ లక్ టెస్ట్ పెట్టారు. పాప్ కార్న్ బాక్స్ లో రాయి పడితే అనుకున్నది జరుగుతుంది..లేదా జరగదు,, అది అసలు మేటర్ . అయితే రష్మి వంతు రాగానే అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. రష్మీ పాప్ కార్న్ బాక్సులు రాయి వేస్తే లవ్ సక్సెస్ అవుతుందని.. పడకపోతే ఫెయిల్ అవుతుందని అంత అనుకున్నారు .
కాగా భారీ ఉత్కంఠ నడుమ రాయి వేసిన రష్మి.. ఆ రాయి బాస్కెట్లు పడింది. ఈ క్రమంలోనే రష్మి సైతం ఆశ్చర్యపోయింది. లవ్ సక్సెస్ అన్న సందర్భంలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేసింది . ఇవి కచ్చితంగా డబ్బులు ఇస్తే వచ్చేటివి కాదు . న్యాచురల్ గా వచ్చేటివి. ఈ క్రమంలోనే రష్మి నిజంగానే ఎవరితోనో లవ్ లో ఉందని ఆ లవ్ సక్సెస్ అవుతుందన్న సందర్భంలోనే ఫేస్ లో తెలియని సిగ్గు కూడా వచ్చేసిందని అందరూ అంటున్నారు .
అంతేకాదు పాప్ కార్న్ బాక్స్ లో రాయపడగానే రష్మీ ఆనందంలో మాస్ చిందులేసింది . నా పొలంలో మొలకలు వచ్చాయంటూ రెచ్చిపోయింది . ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకటి మాత్రం ఫైనల్ రష్మీ ఎవరినో లవ్ చేస్తుంది.. ఆ లవ్ కూడా సక్సెస్ అవుతుంది.. అది ఎప్పుడు బయటపడుతుందో ఆ దేవుడికే తెలియాలి…!!