బుల్లితెరపై జబర్దస్త్ షో ఎంత పాపులారిటీ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కేవలం టిఆర్పీల లో నెంబర్ వన్ గానే కాదు.. ఎంతోమంది కమెడియన్స్ కి లైఫ్ ఇచ్చి వాళ్ళ జీవితాలను చక్కదిద్దిన షోగా పాపులారిటీ దక్కించుకుంది. కాగా ఈ షో తోనే పాపులారిటీ దక్కించుకున్నాడు రాకింగ్ రాకేష్ . చిన్నపిల్లలతో స్కిట్ చేస్తూ సరదా సరదాగా.. ఫన్నీ ఫన్నీగా స్కిట్స్ చేసే రాకింగ్ రాకేష్ రీసెంట్ గానే జోర్దార్ సుజాత ని పెళ్లి చేసుకున్నాడు. వీళ్లను కలిపింది జబర్దస్త్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .
ప్రెసెంట్ వీళ్లిద్దరూ యూట్యూబ్ లో జబర్దస్త్ లో రెండు చేతులారా సంపాదిస్తూ మంచి ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు . రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాకింగ్ రాకేష్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది భార్య సుజాత. అంతేకాదు స్కిట్స్ లో చేసినందుకు ఇప్పటికీ రాకింగ్ రాకేష్ తనకి రెమ్యూనరేషన్ ఇస్తాడు అని చెప్పకు వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆయనను ఓ స్కిట్ లో భాగంగా కొట్టాను.. అందుకు సారీ చెప్పానని కూడా క్లారిటీ ఇచ్చింది .
అంతేకాదు రాకింగ్ రాకేష్ తన వద్ద ఎంత కట్నం తీసుకున్నాడో కూడా చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది సుజాత. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ ..”నిజానికి రాకింగ్ రాకేష్ నా దగ్గర నుంచి ఒక్క రూపాయి కట్నం తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో వాళ్ళు పెట్టాల్సిన సాంప్రదాయాలు కూడా రాకింగ్ రాకేష్ జరిపించారు. నేను ముందే చెప్పాను కట్నం కావాలంటే ముందే అడుగు ..ఆ తర్వాత అడిగితే ఇవ్వను అని ..ఆయన ఒక్క రూపాయి కూడా వద్దన్నాడు ..
నిజంగా గుడ్ హస్బెండ్ ..నాకు ఎన్ని జన్మలు ఉంటే అన్ని జన్మలు అతడే నా భర్తగా రావాలని కోరుకుంటున్నాను” అంటూ తనదైన స్టైల్ లో చెప్పి ఎమోషనల్ అయింది సుజాత . ఈ క్రమంలోనే రాకింగ్ రాకేష్ లోని మంచితనం మరోసారి బయటపడింది. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!