తెలుగు వారి సోగ్గాడు.. శోభన్‌బాబు. ముఖ్యంగా 1980లలో కుటుంబ కథానాయకుడు ఎవరు అంటే.. అన్న గారి తర్వాత..ముందు.. కూడా శోభన్‌బాబు పేరు వినిపించింది. అలా ఆయన తెలుగు వారిని ఆకట్టుకు న్నారు. అయితే.. ఒక్క తెలుగుకే శోభన్‌బాబు పరిమితం కాలేదు. తమిళ ఇండస్ట్రీపైకూడా పట్టు తెచ్చుకు న్నారు. జెమినీ గణేషన్ వంటి హేమీ హేటీ నటులతో కలిసి నటించారు.
అప్పుడే..చాలా మంది తమ వారసులను.. ఇండస్ట్రీలోకి తెచ్చారు. ముక్యంగా శోభన్‌బాబుకు సమకాలికు డు అయిన హీరో కృష్ణ తన ఇద్దరు కుమారులను కూడా బాల నటులుగా రంగంలోకి దింపారు. అప్పటికి శోభన్‌బాబుకు కూడా కుమారుడు ఉన్నా.. ఎప్పుడూ తెరమీదికి కాదు కదా.. అసలు షూటింగ్‌స్పాట్‌లకు కూడా తెచ్చేవారు కాదు. అంతేకాదు.. ఎవరికీ ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేవారు కాదు.
ఇక, ఏదైనా పార్టీకి వచ్చేప్పుడు.. అన్నగారు.. అక్కినేని అయినా.. అడపా దడపా.. ఫ్యామిలీలను తీసుకువచ్చేవారు. కానీ, శోబన్‌బాబు మాత్రం అసలు తన భార్యను పిల్లలను బయటకు తెచ్చేవారు కాదు. కుటుం బం వేరు.. సినిమాలు వేరు అని మొహం మీదే చెప్పేవారు. మీకు నా ఫ్యామిలీ ని చూడాలని ఉంటే.. శాంతినికేతన్‌కు రండి(ఇది ఆయన ఇంటికి పెట్టుకున్న పేరు) అని చెప్పేవారు. ఎక్కువగా ఆయన వివేకానందుడంటే ఇష్టపడేవారు.
అందుకే.. అన్నింటికీ.. చాలా తక్కువ ప్రియార్టీ ఇచ్చేవారుట. దేనినీ సీరియస్గా తీసుకునేవారు కాదు. ఇక, సినిమా ఇండస్ట్రీలో శోభన్‌బాబు ఐదుగురు హీరోయిన్లను ప్రేమించారని పెద్ద ఎత్తున ప్రచారం ఉంది. కానీ, అదంతా ఉత్తిదే.. దాని గురించి నేను మాట్లాడను అని చెప్పేశారు. ఇలా.. శోభన్‌బాబు వ్యక్తిగత జీవితం గురించి.. పిల్లల గురించి.. చాలా తక్కువగానేప్రచారంలోకి వచ్చింది.