పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వరుసగా వస్తోన్న సినిమాల పరంపరలో ముందుగా వస్తోన్న సినిమా ఆదిపురుష్. రామాయణ ఇతిహాసాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కుతోంది. తానాజీ సినిమాతో బాలీవుడ్లో పాపులర్ అయిన ఓం రౌత్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ముందు నుంచి ఈ సినిమాపై పెద్దగా అంచనాలు, ఆశలు ఎవ్వరికి లేవు. టీజర్, స్టిల్స్ వచ్చినప్పుడు కూడా ఇదేంటి యానిమేషన్ బొమ్మల్లా ఉన్నాయన్న విమర్శలు కూడా వచ్చాయి. ఎప్పుడు అయితే ట్రైలర్ బయటకు వచ్చిందో అప్పటి నుంచి ఆదిపురుష్‌పై ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్నంటాయి.
ఇక ఈ సినిమా రన్ టైం లాక్ అయ్యింది. రామాయణం లాంటి మహా చరిత్రని అతి తక్కువ నిడివిలో చెప్పడం అంటే ఎంతో గట్స్ ఉండాలి. ఎంత కట్ చేసినా రన్ టైం నిడివి మూడు గంటల వరకు వచ్చిందట. ఓవరాల్‌గా ఆదిపురుష్ రన్ టైం 2 గంటల 54 నిమిషాలు అంటే 174 నిమిషాల ఉన్నట్టు ఓవర్సీస్ వర్గాలు కన్ఫార్మ్ చేస్తున్నాయి.
అంటే ఓవరాల్‌గా మూడు గంటల రన్ టైం. సినిమా ప్రేక్షకులకు నచ్చితే ఇంత రన్ టైం ఉన్నా ప్రేక్షకుడు బోర్ ఫీల్ కాకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ తరం యూత్‌కు, ప్రేక్షకుడికి సినిమా కనెక్ట్ కాకపోతే అంత సేపు థియేటర్లో సినిమా చూడాలంటే చాలా బోర్ ఫీలవుతాడు. మరి ఓం రౌత్ ఏం మాయ చేసి మూడు గంటల పాటు ప్రేక్షకుడిని థియేటర్లలో కూర్చో పెడతాడో చూడాలి. వచ్చే నెల 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అవుతోంది.