టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న సమంత.. హీరోగా పేరు సంపాదించుకున్న నాగచైతన్య ఒకప్పుడు భార్యాభర్తలు గా ఉన్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఏం మాయ చేసావే సినిమా ద్వారా జనాల్లో హ్యూజ్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ జంట ఆ తర్వాత పలు సినిమాల్లో కలిసి నటించారు . ఆ సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హీట్ అయ్యాయి. రియల్ లైఫ్ లోను భార్యాభర్తలుగా కొన్నాళ్లు బుద్ధిగా కాపురం చేసుకున్నారు . అయితే ఈ జంటకు ఏ దిష్టి తగిలిందో ఏమో తెలియదు కానీ సడన్గా డివోర్స్ అంటూ ప్రకటించి దూరం దూరంగా ఉన్నారు .
వీళ్ళు విడాకులు తీసుకున్న వీళ్ళ మనస్తత్వం బిహేవియర్ మాత్రం ఒకేలా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు, నాగచైతన్య సమంత విడిపోయిన సరే నాగచైతన్య విలువలను ఇష్టాలను సమంత గౌరవిస్తుందని అదే ఫాలో అవుతుందని జనాలు చెప్పుకుంటున్నారు. అంతేకాదు సమంత విడాకులు తీసుకున్న నాగచైతన్య కూడా ఆమె ఇష్ట ప్రకారమే ఇంకా ఇంట్లో నడుచుకుంటున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఇద్దరు ఎంతో ఇష్టపూర్వకంగా వేసుకున్న టాటూ చెరిపేయలేదు .
అంతేకాదు ఇద్దరూ వాళ్ళకి సంబంధించిన తీపి గుర్తులను అలాగే వాళ్ళ వద్ద పెట్టుకొని ఉన్నారట . మరీ ముఖ్యంగా సినిమాల కమిట్మెంట్ విషయంలో ఇద్దరు ఏమాత్రం తగ్గడం లేదు . కంటెంట్ కథ విషయం నచ్చితే ఆ సినిమాకి రెమ్యూనరేషన్ తక్కువ అయినా సరే సినిమా చేసేందుకు సిద్ధపడతారు సమంత – నాగచైతన్య. ఈ విషయంలో పెళ్లి చేసుకోక ముందు ..పెళ్లి చేసుకున్న.. తర్వాత.. విడాకులు తీసుకున్న తర్వాత ఒకేలా ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు . మరి ముఖ్యంగా విడాకులు తర్వాత కూడా వీళ్ళిద్దరూ ఒకరి ఇష్టాలను ఒకరు గౌరవించుకుంటున్నారు అంటే నిజమైన ప్రేమంటే ఇదే అంటూ చెప్పుకొస్తున్నారు ఫ్యాన్స్..!!