విభిన్న పాత్రలతోనే కాదు.. తన వైవిధ్య నట విన్యాసంతో తెలుగు ప్రేక్షకులనే కాకుండా.. మూడు భాషల ప్రేక్షకులను అలరించిన మహా నటీమణి.. భానుమతి. ఒక్క నటనకే ఆమె పరిమితం కాలేదు. సినీరంగం లో ఉన్న 24 కళలోనూ ఆమె ముందంజలో ఉన్నారు. ప్రతి అంశంపైనా ఆమె పట్టు సాధించారు. కథా రచన నుంచి పాటల రచయితగా కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు.
దర్శకురాలిగా.. నిర్మాతగా, గాయకురాలిగా కూడా భానుమతి తన శైలిని దేదీప్యమానం చేశారు. అయితే.. ఇన్నికళల్లో ఆరితేరిన భానుమతికి ఉన్న ఒకే ఒక్క మైనస్ ముక్కుసూటిగా వ్యవహరించడం.. ముక్కుమీద కోపంతో ఖసురుకోవడం. వారు ఎవరైనా సరే.. ఆమెకు లక్ష్యం లేదు. ఎంతటివారైనా సరే.. ఆమె ముందు బలాదూరే. ఈ విషయంలోనే మహానటుడు.. యశస్వి ఎస్వీ రంగారావుకు భానుమతికి మధ్య గ్యాప్ పెంచింది.
తొలినాళ్లలో బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో ఎస్వీ రంగారావుకు కుమార్తెగా ఒకటి రెండు సినిమాల్లో నటించిన తర్వాత.. భానుమతికి రంగారావుకు మధ్య గ్యాప్ పెరిగింది. దీనికి పెద్దగా కారణాలు లేకపోయినా.. ఎందుకో.. ఆయనను ఖసురుకునేసరికి రంగారావు హర్ట్ అయ్యారు. అదేంటి ఆ పిల్ల.. నామీదే విరుచుకుపడుతోంది. రేపటి నుంచి ఆమెను తీసేయండి
అని నిర్మాతకు చెప్పారు. అయితే.. ఇప్పటిలా అప్పట్లో కాంట్రాక్టు కాకపోవడంతో.. భానుమతిని వాహినీ సంస్థ తీసి పక్కన పెట్టింది.
ఆమె స్థానంలో అప్పటి నటి.. ఓల్డ్ గీతాంజలిని తీసుకున్నారు. దీంతో హర్టయిన భానుమతి.. తర్వాత.. కసితో సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసుకుని.. సినిమాలు తీశారు. అయితే.. ఇక, అప్పటినుంచిఎక్కడా కూడా ఎస్వీ రంగారావుతో ఆమె కలిసి నటించిన పరిస్థితి లేకపోవడం గమనార్హం.