టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా క్రేజ్ ప్రెసెంట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . హ్యాపీ డేస్ సినిమాతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది . అంతే కాదు ప్రెసెంట్ టాలీవుడ్ -బాలీవుడ్ -కోలీవుడ్ సినిమాలలో వరుసగా అవకాశాలు అందుకుంటు స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. రీసెంట్గా బాలీవుడ్ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తమన్నా ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది . ఈ క్రమంలోనే తన పర్సనల్ అండ్ ప్రైవేట్ లైఫ్ కి సంబంధించిన న్యూస్ ల పై కూడా తమన్నా స్పందించడం ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .
కాగా ఇదే క్రమంలో ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ ..”నేను ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాను. .. డైట్ ఫాలో అవుతాను కానీ ఎలాంటి డైట్ ఫాలో అయినా సరే నాకు కచ్చితంగా కాఫీ ఉండాల్సిందే భోజనం లేకపోయినా సరే ఉంటాను ..కానీ కాఫీ మాత్రం ఉండాల్సిందే . ఒకవేళ భోజనం స్కిప్ చేస్తే మాత్రం ఖచ్చితంగా రెండు కాఫీలు తాగుతాను “అంటూ చెప్పుకొచ్చింది . అంతేకాదు తమన్నా బ్యూటీ ప్రొడక్ట్స్ విషయంలో చాలా కేర్ గా ఉంటుందట . ఎవరు చెప్పింది వినదట. యూస్ చేసిన తర్వాత ఆమెకి రిజల్ట్ ఉంటేనే మళ్లీ ఆ ప్రోడక్ట్ ని తిరిగి వాడుతుందట .
అంతేకాదు సినిమాలో ఎలాంటి రోల్స్ అయినా చేయగలను గాని .. ఒకవేళ సినిమాలో రోలర్ కోస్టర్ ఉంటే మాత్రం చచ్చిన సినిమా ఒప్పుకోనని.. నాకు రోలర్ కోస్టర్ అంటే చాలా భయం అని ..అవసరమైతే ఆ సినిమాలైనా వదులుకుంటాను ..కానీ అలాంటి సీన్ ఉంటే మాత్రం చచ్చిన చేయను అని చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే ఇండస్ట్రీలను షేక్ చేసే మిల్కీ బ్యూటీ తమన్నాకు రోలర్ కోస్టర్ అంటే అంత భయమ..? అంటూ జనాలు ఆశ్చర్యంగా కామెంట్స్ చేస్తున్నారు . మరికొందరు తమన్న మాటలు విని ఫన్నీగా నవ్వుకుంటున్నారు . ఇవే కాకుండా తమన్న తన పర్సనల్ విషయాలకు సంబంధించిన ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రజెంట్ తమన్న కామెంట్స్ వైరల్ గా మారాయి..!!