సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవ్వరు చెప్పలేరు. భారీ అంచనాలతో బోలెడన్ని ఎక్స్పెక్టేషన్స్ తో సినిమా ఇండస్ట్రీ లోకి హీరోయిన్ అయిపోదామని వచ్చిన తెలుగు అమ్మాయి బిందు మాధవి కెరియర్ స్టార్టింగ్ లో ఎలాంటి పాత్రలు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుందో కూడా మనకు తెలిసిందే . అయితే మెల్ల మెల్లగా ఆమె కోలీవుడ్లోకి వెళ్లి అక్కడ పాపులారిటీ సంపాదించుకొని.. ఆ పాపులారిటీతో తెలుగులో మళ్ళీ అవకాశాలు అందుకుంటుంది బిందు మాధవి.
మరీ ముఖ్యంగా ఆమె కెరీర్ బిగ్ బాస్ మార్చేసిందని చెప్పాలి . ఆడపులిగా పేరు సంపాదించుకున్న బిందు మాధవి రీసెంట్ గా చేస్తున్న వెబ్ సిరీస్ “న్యూసెన్స్” నవదీప్ ఈ సినిమాల్లో మెయిన్ లీడ్ లో నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే వెబ్ సిరీస్ ప్రమోషన్ తో భాగంగా మీడియాతో ఇంట్రాక్ట్ అయ్యారు బిందు మాధవి- న్యూసెన్స్ టీం . ఈ క్రమంలోనే మీడియా రిపోర్టర్ ఆమెకు ఓ ప్రశ్న వేశారు . “త్రిష బాయ్ ఫ్రెండ్ ని మీరు ప్రేమించారా ..?” అంటూ ఓపెన్ గా అడిగేసారు .
ఈ క్రమంలోనే బిందు మాధవి సైతం బోల్డ్ గా ఆన్సర్ ఇచ్చింది . “ఎస్ అది నిజమే త్రిష బాయ్ ఫ్రెండ్ ని నేను ప్రేమించిన మాట వాస్తవమే. అయితే ఇద్దరం ఒకేసారి ప్రేమించలేదు ..త్రిషకు అతగాడు ఎక్స్ అయిన తర్వాతే నేను ప్రేమించాను ” అంటూ క్లియర్ గా క్లారిటీగా ఆన్సర్ ఇచ్చింది . ఈ క్రమంలోనే బిందు మాధవి ఆల్ రెడి వేరే హీరోయిన్స్ ప్రేమించిన మగాడిని కూడా ప్రేమిస్తుందా ..? అంటూ జనాలు షాక్ అయిపోతున్నారు . మరికొందరు ప్రేమ ఎప్పుడు ఎలా ఎవరికి పుడుతుందో ఎవరు చెప్పలేరు బాస్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు . ఓవరాల్ గా బిందు మాధవి ఇచ్చిన ఆన్సర్ బాగానే ఉన్నా ..ఆమెను తెలియకుండానే డీగేడ్ చేసే విధంగా ఉంది అంటున్నారు సినీ ప్రముఖులు . చూద్దాం బిందు మాధవి ఈ కామెంట్స్ నుంచి ఎలా తప్పించుకుంటుందో..?