సాధారణంగా.. సినీరంగంలో ఉన్నవారు.. తమ ఆస్తులను.. విరాళాలుగా ఇవ్వడం తెలిసిందే. కొందరు వ్యాపారాలు వృద్ది చేసుకుని..వారసులకు అప్పగించారు. ఇలాంటి వారిలో అన్నగారు ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు ప్రముఖంగా కనిపిస్తారు. అదేవిధంగా తెలుగువాడైన శోభన్‌బాబు కూడా.. ఆస్తులు సంపా యించుకుని.. తన కుమారుడికి అప్పగించారు. ఇప్పుడు చెన్నైలో చుట్టుపక్కల అంతా కూడా.. ఆయన ఆస్తులే ఉన్నాయి.
అదేవిధంగా మోహన్‌బాబు కూడా అంతే. తాను సంపాయించుకున్న దాన్ని పెట్టుబడులుగా పెట్టుకున్నా రు. చిరంజీవి, మురళీమోహన్ వంటి వారు కూడా.. దానాలు, ధర్మాలకు కడుదూరం. ఎక్కడైనా.. ఎప్పుడైనా అవసరం ఉంటే..తప్ప వారు బయటకు రారు. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా అరంగేట్రం చేసి బాగా సంపాయించుకున్నాక.. కూడా.. ఆస్తులపైనే దృష్టి పెట్టారు. ఉదాహరణకు పద్మనాభం.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అరంగేట్రం చేశారు. అల్లు రామలింగయ్య కూడా అంతే.
వీరిద్దరూ.. కూడా ఆస్తులు సంపాయించుకున్నారు. అదేసమయంలో మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు.. రాజబాబు.. నాగభూషణం, సీఎస్ ఆర్, పేకేటి శివరావ్ వంటి వారుకూడా.. సంపాయించుకున్నా.. వారికి ఉన్న అలవాట్ల
కారణంగా.. అంతా ఖర్చు చేసుకున్నారు. ఇక నాగయ్య విషయానికి వస్తే.. ఆయన చాలా ఉదారమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎవరైనా ఆయన వద్దకు వెళ్లి.. ఏం అడిగినా ఇచ్చేసేవారట. దీంతో ఆయన కూడా తన ఆస్తిని పోగొట్టుకున్నారు.
కానీ, హీరోయిన్ల విషయానికి వస్తే.. మాత్రం.. చాలా మంది దాన ధర్మాలు చేసేవారట. వారికి కుటుంబాల్లో ఉన్న చిక్కులు కావొచ్చు… మరికొందరిఉదార స్వభావం కావొచ్చు.. దాన ధర్మాలు ఎక్కువగా చేసేవారు. సావిత్రి.. నిలువు దోపిడీ ఇస్తే.. అప్పట్లో కిలోన్నర బంగారం వచ్చింది. అదంతా కూడా.. ఆంధ్రా ఉద్యమానికి వచ్చేవారు. ఇక, దివిసీమ తుఫాను సమయంలో.. అంజలీదేవి తన సినిమా రెమ్యునరేషన్ మొత్తాన్ని లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చారు.
భానుమతి పైకి ఫైర్ కానీ.. ఇలాంటి విషయాల్లో.. ఇవ్వాలా..! అంటూనే ఇచ్చేవారట. అంతేకాదు..మనం ఇవ్వకపోతే.. ఎవరిస్తారు! అంటూ.. చురకలు అంటించేవారట. ఇవన్నీ ఒక ఎత్తయితే.. భానుమతిఇచ్చారని తెలిస్తే.. మిగిలిన వారు.. ఆమె ఎంత సాయం చేశారు? అని కనుక్కుని మరీ తమ వంతు విరాళంగా ఇచ్చేవారు. ఇదీ.. సంగతి..!