హమ్మయ్య .. ఫైనల్లీ అక్కినేని నాగచైతన్య తన మనసులో ఏది ఉందో క్లియర్ గా చెప్పేసాడు . దీంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు . గత కొంత కాలంగా నాగ చైతన్య – శోభిత ధూళ్లిపాళ్ల తో ప్రేమలో ఉన్నాడు అని .. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో నానా రకాలుగా ప్రచారం జరిగింది . అంతేకాదు కొందరు ఏకంగా ఆమెను ట్యాగ్ చేసి మరి శోభిత ను అక్కినేని ఇంటికి కోడలుగా మార్చేశారు .
ఈ క్రమంలోనే ఆయన నెక్స్ట్ సినిమా “కస్టడీ” ప్రమోషన్స్ లో భాగంగా యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య ఆ విషయాలపై క్లారిటీ ఇచ్చేసాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా కృతిశెట్టి హీరోయిన్గా నటిస్తున్న సినిమా కస్టడి . ఈ సినిమా మే 12న గ్రాండ్‌గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని ప్రమోషన్స్ పనుల్లో పాల్గొంటున్న నాగచైతన్య.. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు .
హోస్ట్ అడిగిన ప్రశ్నలకు ఆన్సర్ ఇస్తూ ..”మీరు సినిమాల విషయంలో డివర్స్ విషయంలో పశ్చతాప పడ్డారా..? అంటే నో ” అంటూ ఓపెన్‌గానే చెప్పుకు వచ్చాడు . కానీ రెండు మూడు సినిమాలు విషయంలో రీగ్రేట్ గా ఫీలయ్యాను అంటూ చెప్పుకొచ్చాడు . అంతేకాదు ” మీకు సీక్రెట్ క్రష్ ఎవరైనా ఉన్నారా..? అంటూ యాంకర్ అడగగా.. ఏమాత్రం మొహమాట పడకుండా నాకు సీక్రెట్ క్రష్ ఎవరూ లేరు.. ఉంటే మీకు స్వయంగా చెప్పేస్తాను.. కానీ ఈ మధ్యకాలంలో నేను హాలీవుడ్ లోని బాబిలోన్ అనే ఒక మూవీ చూశాను .
అందులో నటి మార్గోట్ రాబీ నటనకు నేను చాలా ఫిదా అయిపోయాను . ఆమెను చూసి చూడంగానే లవ్ లో పడిపోయాను. ఆమెపై ఇష్టం పెరిగింది.. ప్రజెంట్ నా క్రష్ ఆమెపైనే ఉంది అంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు . ఈ క్రమంలోనే శబితా ధూళిపాళ్లతో నిజంగా ప్రేమ నడిపితే నాగచైతన్య ఓపెన్ గా చెప్పేస్తాడు . సో అలాంటిది చెప్పలేదు అంటే శోభిత తో కేవలం ఫ్రెండ్షిప్ అంటూ ఫ్యాన్స్ క్లారిటీ కి వచ్చారు. అంతే కాదు గతంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కచ్చితంగా రెండోసారి నాకు ప్రేమ పుడుతుంది అంటూ కూడా క్లారిటీ ఇచ్చాడు . ఈ క్రమంలోనే నాగచైతన్య ఎప్పుడో ఒకసారి అయితే పెళ్లి చేసుకుంటాడు అంటూ ఫిక్స్ అయిపోయారు జనాలు..!!