Newsశృతిహాస‌న్ వీపుమీదున్న ఈ టాటూకు ఇంత పెద్ద చ‌రిత్ర ఉందా…!

శృతిహాస‌న్ వీపుమీదున్న ఈ టాటూకు ఇంత పెద్ద చ‌రిత్ర ఉందా…!

సినిమా రంగంలో చాలా మందికి చాలా సెంటిమెంట్లు ఉంటూ ఉంటాయి. ఒక‌రి సెంటిమెంట్లు మ‌రొక‌రికి విచిత్రంగా ఉంటాయి. ఇక సినిమా వాళ్ల‌లో చాలా మందికి భ‌క్తిభావం, దేవుడు అంటే ఆస‌క్తి ఉండ‌దు. వారి ప్ర‌పంచ‌మే డిఫ‌రెంట్‌గా ఉంటుంది. అయితే కొంద‌రికి మాత్రం దేవుడు, భ‌క్తి, భ‌యం ప‌ట్ల ఆస‌క్తి ఉంటుంది. ఒకే ఇంట్లో ఉన్న ఇద్ద‌రు సినిమా సెల‌బ్రిటీల్లో భిన్న వైరుధ్యాలు ఉన్న‌వాళ్లు కూడా ఉంటారు.

ఉదాహ‌ర‌ణ‌కు క‌మ‌ల్ హాసన్ కుటుంబం నుంచి ఆయ‌న సినీ వార‌సురాలిగా పెద్ద కుమార్తె శృతి హాస‌న్ అరంగేట్రం చేశారు. ఎంత తండ్రి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా కూడా స్వశక్తితోనే ఆమె హీరోయిన్‌గా ఎదిగారు. తనకు తన తల్లిదండ్రులు స్వేచ్ఛనిచ్చారని చెప్పే శ్రుతిహాసన్‌ ఇప్పటికీ స్వతంత్రభావాలతోనే ఉంటారు. ప్రేమ‌లు, డేటింగ్‌లు ఇలా ఏవి అయినా ఆమె నిర్ణ‌యాలే ఫైన‌ల్ అవుతూ ఉంటాయి.

ఇక శృతి తండ్రి కమలహాసన్‌ పక్కా నాస్తికుడు అన్న విషయం తెలిసిందే. తండ్రి భావాల‌తో పోలిస్తే విరుద్ధ భావాలు కలిగిన నటి శ్రుతి తనకు దైవభక్తి ఎక్కువ అని ఓపెన్‌గానే చెపుతూ ఉంటుంది. అలాగని దేవాలయాలకు వెళ్లడానికి పెద్దగా ఆసక్తి చూపనని… త‌న‌ మనసునే ఓ ఆలయం అని భావిస్తానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో స్ప‌ష్టంగా చెప్పింది.

ఇక శృతి ఇంట్లో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు చెప్పారు. తన ఆధ్యాత్మిక భావాన్ని వ్యక్తం చేసే విధంగా శృతీహాసన్‌ తన వీపు పైభాగంలో శ్రుతి అని తన పేరుతో పాటు కుమారస్వామి ఆయుధం అయిన వేలాయుధం గుర్తును టాటూగా వేయించుకున్నారు. అది ఆమె వీపు వెన‌క ఉన్న టాటూ హిస్టరీ..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news