Newsచిన్న వయసులోనే చిరంజీవి చెత్త పని..చావకొట్టేసిన తండ్రి.. ఏం చేసాడో తెలుసా..?

చిన్న వయసులోనే చిరంజీవి చెత్త పని..చావకొట్టేసిన తండ్రి.. ఏం చేసాడో తెలుసా..?

వాట్ ..మెగాస్టార్ చిరంజీవిని తన నాన్నగారు పిచ్చ కుక్క కన్నా దారుణంగా కొట్టాడా..? రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఎస్ మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలో ఎంత స్టార్ స్టేటస్ లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అలాంటి మెగాస్టార్ చిరంజీవి ఎంతో పద్ధతిగా పంచువాలిటీగా రూల్స్ మెయిన్ టైన్ చేస్తూ ఉంటాడు . అలాంటి చిరంజీవిని సైతం చిరంజీవి వాళ్ళ నాన్నగారు కొట్టారు అన్న విషయం ఇప్పుడు ఇండస్ట్రీలు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..మెగాస్టార్ చిరంజీవి ఈ కామెంట్స్ చేశారు . “సరిగ్గా 11 ఏళ్లు ఉంటాయేమో నాకు ఆ టైంలోనే నేను ఆరవ తరగతి చదువుతున్నాను. ఆ టైంలో నెల్లూరులో ఏవీఎస్ సంస్థ నిర్మించిన రాము అనే చిత్రం విడుదలైంది . నేను అన్నగారికి చాలా చాలా పెద్ద ఫ్యాన్. కచ్చితంగా ఆయన సినిమాలు చూడాలనుకుంటాను . ఎలాగోలా ఆ సినిమాకి సంబంధించి టికెట్ సంపాదించాను. అయితే మా నాన్నగారు పోలీస్ కానిస్టేబుల్ కావడంతో అక్కడ రద్దీ ఎక్కువగా ఉండడంతో అక్కడికి వచ్చారు .

ఆ తోపులాటలో నేను బాగా నలిగిపోయాను . అది చూసి కోపంతో కొబ్బరి మట్ట తీసుకొని నన్ను వాయించి వదల కొట్టారు . నెల్లూరు కనకమహాల్ థియేటర్ దగ్గర నుండి మూలా పేట్ వరకు కొట్టుకుంటూ ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు . మా నాన్నకు ఆవేశం వస్తే అంతే.. మనిషి కాదు కొట్టేస్తారు . ఆరోజును ఇప్పటికే నేను మర్చిపోలేను” అంటూ ఆయన లైఫ్ లో ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకున్నారు .

అంతేకాదు ఇప్పటికీ రాము అన్న పేరు విన్న ఏవీఎం అన్న పేరు విన్న అదే గుర్తొస్తుందట మెగాస్టార్ చిరంజీవికి . ఏది ఏమైనా సరే చిన్న ఏజ్ లోనే మెగాస్టార్ సినిమాలపై ఇంత పిచ్చిని పెంచుకున్నారా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . ఆ పిచ్చి ఉండడం వల్ల ఇప్పుడు మెగాస్టార్ అయ్యారని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు .. మొత్తానికి నాన్న దగ్గర దెబ్బలు తిని మెగాస్టార్ చిరంజీవి అయ్యాడు అన్నమాట మన చిరంజీవి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news