సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే .. అది కచ్చితంగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోయిన్ అనుష్క పెళ్లి మేటర్ అనే చెప్పాలి . వీళ్ళ మధ్య నిజంగా ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ ..సోషల్ మీడియాలో మాత్రం కచ్చితంగా వారానికి ఒకసారి ఈ జంటకు సంబంధించిన ఏదో ఒక విషయం ట్రోల్ అవుతూనే ఉంటుంది . రీసెంట్గా ప్రభాస్ – అనుష్కల లవ్ మేటర్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .
మనకు తెలిసింది అనుష్క శెట్టి “నిశబ్దం” సినిమా తర్వాత దాదాపు మూడున్నర ఏళ్ళు గ్యాప్ తీసుకొని చేస్తున్న సినిమా “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”.. నవీన్ పోలిశెట్టి ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అనుష్క శెట్టి ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్గా సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టోటల్ కామెడీ టీం లైన్ తోనే ముందుకు తీసుకెళ్లిన ఈ టీజర్ అభిమానులను బాగా ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే పాజిటివ్ రివ్యూస్ ఎక్కువగా వినిపిస్తున్నాయి .
హీరో ప్రభాస్ తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేస్తూ ఆల్ ద బెస్ట్ చెప్పారు . అది చూసిన అనుష్క – ప్రభాస్ పెట్టిన పోస్ట్ కు “థాంక్యూ పుప్స్” అంటూ రాసుకొచ్చింది . ఈ క్రమంలోనే ప్రభాస్ ని అనుష్క ముద్దుగా ఇలా పిలుస్తుందా..? అంటూ చర్చించుకుంటున్నారు . అంతేకాదు నిజంగా ఇది చాలా ముద్దుగా ఉందని వీళ్ళ ప్రేమ చాలా క్యూట్ క్యూట్ గా ముందుకెళ్తుందని ఆ విషయాన్ని ఇద్దరు దాచేస్తున్నారని చెప్పుకొస్తున్నారు . అంతే కాదు త్వరలోనే ఈ జంట గుడ్ న్యూస్ చెప్పిన ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ కామెంట్స్ చేస్తూ ఉండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!