Moviesమహేశ్ బాబు వేసుకున్న ఈ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?...

మహేశ్ బాబు వేసుకున్న ఈ బ్యాగ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..? ఖరీదు తెలిస్తే మైండ్ బ్లాకే..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి స్టార్ సెలబ్రిటీస్ వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ గురించి ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. అంతకు ముందు స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి బట్టలు ధరిస్తారో.. ఎంత కాస్ట్ ఉంటుంది ..ఎలాంటి లగ్జరీ ఐటెమ్‌స్ ను స్టార్ సెలబ్రెటీస్ కోరుకుంటూ ఉంటారో అనే విషయం చాలామందికి తెలుసుకోవాలని ఉన్నా కూడా ..ఆ విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ లేకుండా పోయేది. కానీ సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఇప్పుడు ఎలాంటి చిన్న విషయమైనా సరే ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది.

కాగా రీసెంట్ గా టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వేసుకున్న బ్యాగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే మహేష్ బాబు ఎస్ ఎస్ ఎన్ బి 28 సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది . అయితే రీసెంట్ గానే ఫ్యామిలీతో ఫారిన్ ట్రిప్ కారణంగా ఈ సినిమా షూటింగ్ బ్రేక్ వేసుకొని మరి ఫ్యామిలీతో దుబాయ్ చెక్కేసాడు మహేష్ బాబు . ఈ క్రమంలోనే భార్య నమ్రత – పిల్లలు గౌతమ్ -సితారలతో మహేష్ బాబు ఎయిర్పోర్టులో దర్శనమిచ్చారు .

ఈ క్రమంలోనే మహేష్ బాబు ధరించిన బ్యాగ్ చాలా ఆకర్షణీయంగా ఉంది . అంతేకాదు మహేష్ బాబు క్లాస్ లుక్ కి ఆ బ్యాగ్ భళే సెట్ అయ్యింది. ఇప్పుడు ఈ బ్యాగ్ కి సంబంధించిన వివరాలను వైరల్ చేస్తున్నారు మహేష్ బాబు ఫ్యాన్స్ . ఈ బ్యాగ్ లూయిస్ విటెన్ క్రిస్తఫర్ గా తెలుస్తుంది . నలుపు నీలం డిజైన్ తో ఎంతో అందంగా మరియు ఆకర్షణీయంగా ఉంది. ఈ బ్యాగ్ అలాగే ఎల్ వి మోనోగ్రామ్ సిగ్నేచర్ డిజైన్ కూడా ఈ బ్యాక్ పై ఉంది . కాగా ఈ బ్రాండెడ్ బ్యాగ్ ధర ఎంతో తెలిస్తే దిమ్మ తిరిగిపోవడం ఖాయం. ఈ బ్యాగ్ ఖరీదు 3, 92,656 అంటూ తెలుస్తుంది . ఈ విషయం తెలుసుకొని షాక్ అయిపోతున్నారు ఫ్యాన్స్. ఒక్క బ్యాగ్ ఏ ఇంత ఖరీదా అంటూ స్టన్ అయిపోతున్నారు . మరికొందరు మహేష్ బాబు రేంజ్కి అంత మాత్రం లేకపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news