యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఒక పేరు కాదు.. బ్రాండ్ కాదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా మారిన ఎన్టీఆర్ తన రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ 1తో తిరుగులేని హిట్ కొట్టాడు. ఆ తర్వాత ఆది, సింహాద్రి సినిమాలు ఎన్టీఆర్ రేంజ్‌ను ఎక్కడికో తీసుకువెళ్లాయి. ఇక ఎన్టీఆర్‌కు టెంపర్ సినిమా నుంచి వరుసగా అన్ని సూపర్ హిట్లే. టెంపర్ – నాన్నకు ప్రేమతో – జనతా గ్యారేజ్ – జై లవకుశ – అరవింద సమేత – త్రిబుల్ ఆర్ ఇలా ఆరు వరుస హిట్లు పడ్డాయి
త్రిబుల్ ఆర్ సినిమా అయితే ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో హిట్ కొట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఒక్కో సినిమాకు రు. 60 కోట్లకు పైనే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే కెరీర్ స్టార్టింగ్‌లో ఎన్టీఆర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఎన్టీఆర్ చిన్నప్పుడే బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో బాలనటుడిగా కెరీర్ స్టార్ట్ చేశాడు.
ఆ తర్వాత బాల రామయణం సినిమా చేశాడు. ఇక 2001లో వచ్చిన నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఉషాకిరన్ మూవీస్ బ్యానర్‌పై రామోజీరావు నిర్మించిన ఈ సినిమాకు వీఆర్. ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించినందుకు గాను రామోజీరావు ఎన్టీఆర్‌కు రు. 3 లక్షలు ఇచ్చారట.. ఆ రోజుల్లో అది చాలా ఎక్కువే.
ఆ డబ్బు చూసి మురిసిపోయిన తారక్ చాలా రోజుల పాటు ఆ డబ్బుల కట్టలు పదే పదే లెక్క పెట్టుకునేవాడట. ఆ తర్వాత ఎన్టీఆర్ ఒక్కో మెట్టు ఎదుగుతూ ఈ రోజు పాన్ ఇండియా స్టార్ హీరో అవ్వడంతో పాటు కోట్ల రేంజ్‌లో రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి వెళ్లాడు.