దిగ్గజ తెలుగు నిర్మాత, దివంగత దగ్గుబాటి రామానాయుడుకు.. సినిమా ఇండస్ట్రీలో ఎంతో మందితో పరి చయం ఉంది. అలానే అప్పటి దిగ్గజ నటులు అన్నగారు ఎన్టీఆర్, ఏఎన్నార్లతోనూ.. రామానాయడుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఏకంగా అక్కినేని కుటుంబంతో ఆయన వియ్యమే అందుకున్నారు. అయితే.. దీనికి మించి.. అన్నగారితో సాన్నిహిత్యం ఎక్కువగా ఉండేది.
రామానాయుడు తొలిసినిమా నుంచి రామారావుకు ఎంతో సన్నిహితంగా ఉండేవారు. అనురాగం అనే ఫస్ట్ పిక్చర్‌ను నిర్మించిన ఆయన అప్పటి నుంచి కూడా రామారావుకు సన్నిహితంగా ఉండేవారు. నిర్మాతగా ఆయన ఎన్టీఆర్ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పేవారు. అయితే.. సినీ రంగంలో అక్కినేని తనకు సలహాదారుగా ఉన్నారని పదే పదే చెప్పుకొనే వారు.
ఇక, అన్నగారితో మరో అనుబంధం కూడా రామానాయుడు కు ఉంది. రామానాయుడు ఏ కార్యక్రమం చేపట్టినా.. అన్నగారు తొలి టెంకాయ కొట్టాల్సిందే. ఇలా.. రామానాయుడు స్టూడియో ప్రారంభం కూడా జరిగింది. తర్వాత.. తన ఇంట్లో పెళ్లిళ్లు.. శుభకార్యాలు ఏవి జరగాలన్నా.. అన్నగారితోనే ప్రారంభించేవారు. తర్వాత.. అన్నగారు రాజకీయ రంగంలోకి అడుగు పెట్టినప్పుడు.. ప్రకాశం జిల్లాలో ప్రచార బాధ్యతలను తానే తీసుకున్నారు.
ఇలా.. అన్నగారితో ఎంతో అవినాభ సంబంధం కొనసాగించిన రామానాయుడు.. అదే పార్టీ తరఫున బాపట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇలా.. అన్నగారి కుటుంబంతో రామానాయుడుకు అవినాభావ సంబంధం ఉంది. అయితే.. అన్నగారి కంటే కూడా.. అక్కినేనితోనే ఎక్కువగా సినిమాలు రూపొందించిన రామానాయుడు.. ఒక చరిత్ర సృష్టించారు.