Moviesహీరోయిన్ డింపుల్ హయాతి ఓవర్ యాక్టింగ్.. "మధ్యలో మా బాలయ్యని ఎందుకు...

హీరోయిన్ డింపుల్ హయాతి ఓవర్ యాక్టింగ్.. “మధ్యలో మా బాలయ్యని ఎందుకు లాగుతున్నావే తల్లి”..? .

గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో హీరోయిన్ డింపుల్ హయాతి పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఏకంగా డీసీపీ రాహుల్ హెగ్డే వాహనాన్ని ఢీ కొట్టి సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది . అంతేకాదు తనపై పోలీసు కేసు కూడా నమోదయింది . దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ సోషల్ మీడియాలో గత కొన్ని రోజుల నుంచి హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే డింపుల్ హయాతి డేటింగ్ చేస్తుందని కూడా బయటపడింది.

దీంతో ఇప్పటిప్పుడే అవకాశాలు అందుకుంటూ ఇండస్ట్రీలో ఎదుగుతున్న డింపుల్ హయాతి కెరియర్ పూర్తిగా పడిపోతుంది అంటూ సినీ విశేషకులు అభిప్రాయపడుతున్నారు . కాగా తనపై ఇలా బురద చల్లడానికి కారణమైన వాళ్లకు ఇచ్చిపడేస్తు డింపుల్ హయాతి బాలయ్య డైలాగ్ ను వాడుకునింది. ఈ క్రమంలోని సింహా సినిమాలో బాలయ్య చెప్పే ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది .

దీంతో డింపుల్ హయాతి చేసిన పనికి షాక్ అవుతున్నారు జనాలు. పోలీసులను టార్గెట్ చేసి ఇలాంటి వీడియో పోస్ట్ చేయడం ఎంతవరకు న్యాయమంటూ మండిపడుతున్నారు. దీంతో డింపుల్ హయాతికి ఇంత బలుపా..? అంటూ కొందరు జనాలు షాక్ అవుతుంటే.. మధ్యలోకి మా బాలయ్య లాగాల్సిన అవసరం ఏముంది అంటున్నారు నందమూరి ఫ్యాన్స్ . ఏది ఏమైనా సరే తెలిసి తెలియక తనంతో చేసిన డింపుల్ హయాతి పనులు ఇప్పుడు ఆమె తన మెడకు చుట్టుకునేలా ఉన్నాయి . కెరీర్ డిజాస్టర్ అవడం పక్క అంటున్నారు జనాలు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news