టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా విషయంలో ముందు నుంచి చాలా సందేహాలు వస్తున్నాయి. సినిమా అనుకున్నట్టుగా ముందుకు కదలడం లేదు. ముందు మహేష్ ఇంట్లో అనుకోని సంఘటనలు జరగడంతో షూటింగ్ లేట్ అయ్యింది. ఆ తర్వాత త్రివిక్రమ్ చెప్పిన స్క్రిఫ్ట్ మహేష్‌కు నచ్చలేదు. మార్పులు, చేర్పులు చేశారు.
ఆ తర్వాత ఫస్ట్ షెడ్యూల్ ఓ షాపింగ్ మాల్లో చేశారు. మహేష్, శ్రీలీల కలిసి పాల్గొన్న ఈ ఫుటేజ్ ఏ మాత్రం సరిగా రాలేదట. మరోసారి షూట్ చేద్దామని త్రివిక్రమ్ చెప్పడంతో మహేష్ కోపం కట్టలు తెంచుకుందన్న గుసగుసలు కూడా వినిపించాయి. ఇలా ప్రతిసారి ఈ సినిమా ఒక అడుగు ముందుకు పడితే.. మూడు అడుగులు వెనక్కు అన్నట్టుగా వస్తోంది.
మరోవైపు త్రివిక్రమ్ మహేష్ సినిమా మీద కంటే పవన్ సినిమాల మీద బాగా కాన్సంట్రేషన్ చేస్తున్నాడన్న టాక్ ఉంది. ఉండడం కాదు.. నిజంగానే పవన్ సినిమాలు… మాటలు, స్క్రీన్ ప్లేలు ఇలా అక్కడే త్రివిక్రమ్ టైం అంతా స్పెండ్ చేస్తోన్న పరిస్థితే ఉంది. త్రివిక్రమ్ తీరుతో విసిగిపోతోన్న పవన్ ఇప్పుడు కంటిన్యూగా 90 రోజులు షెడ్యూల్ ప్లాన్ చేయమని త్రివిక్రమ్‌కు చెప్పాడట.
అంటే త్రివిక్రమ్ మరో సినిమా మీద దృష్టి పెట్టకుండా ఉండేందుకే ఈ కొత్త కండీషన్ పెట్టాడని తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ తెలివిగా కొందరు యాక్టర్ల డేట్లు దొరకట్లేదని చెపితే.. వారిని మార్చేసి.. వారి ప్లేసులో కొత్తవారిని తీసుకోమని కూడా ఖరాఖండీగా చెప్పేశాడట. తనకు బౌండెడ్ స్క్రిఫ్ట్‌తో పాటు 90 రోజుల షెడ్యూల్స్ ఇచ్చేయమని ముందే చెప్పేశాడట.
దీంతో ఇప్పుడు త్రివిక్రమ్ కిందామీదా పడుతున్నట్టుగా తెలుస్తోంది. మహేష్ తనమీద అంతలా ప్రెజర్ పెడుతుండడంతో ఏం చేయలేక తర్జన భర్జన పడుతున్నాట్ట. ఇక ఈ నెల 31న మహేష్‌బాబు తండ్రి కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్, లుక్ వదిలాలని ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున కృష్ణ బ్లాక్‌బస్టర్ మూవీ మోసగాళ్లకు మోసగాడు మళ్లీ రీరిలీజ్ చేస్తున్నారు. ఆ సినిమా ఆడే థియేటర్లలోనే మహేష్ టైటిల్, లుక్ వీడియో ప్రదర్శించాలని చూస్తున్నారు.