శ్రీవిద్య.. తమిళ హీరోయిన్‌గా మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే తెలుగులో తొలిసారి అరంగేట్రం చేయించారు దాసరి నారాయణరావు. అయితే.. ఎక్కువ కాలం ఆమె సినీ రంగంలో నటించలేక పోయారు. తమిళ ప్రేక్షకుల అభిరుచికి తెలుగు ప్రేక్షకుల అభిరుచికి మధ్య తేడా ఉంది. అక్కడి వారు ఇష్టపడినట్టు తెలుగు ప్రేక్షకులు.. హీరోయిన్లను బొద్దుగా ఉంటే చూడలేరు. ఇదే శ్రీవిద్యకు ఇబ్బందిగా మారింది
కానీ, శ్రీవిద్యతో దాసరి చేసిన ప్రయోగం మాత్రం సూపర్ సక్సెస్ సాధించింది. అదే.. తూర్పు-పడమర. ఈ సినిమాలో నరసింహరాజును శ్రీవిద్య సరసన తీసుకున్నారు. దీనికి కూడా ఒక కారణం ఉంది. అసలు.. శ్రీవిద్య సరసన శోభన్ బాబును తీసుకోవాలని అనుకున్నారు. దాసరికి.. శోభన్‌బాబుకు మధ్య మంచి అను బంధం కూడా ఉంది. దీంతో తూర్పు-పడమర సినిమాలో శోభన్‌నే మాట్లాడుకున్నారు. కానీ, రెమ్యునరేషన్ సహా.. కాల్షీట్లు కుదరలేదు.
దీంతో ఎక్కడా లేని విధంగా నరసింహరాజును తీసుకువచ్చి..దాసరి పరిచయం చేశారు. నరసింహరాజు.. హీరోనా.. అంటూ.. ఇండస్ట్రీ అంతా నవ్వింది. కానీ, దాసరి ప్రయోగాలు.. అన్నీ ఇన్నీ కావు కదా..! రోడ్డున పోతున్న వారిని తీసుకువచ్చి.. ఆయన హీరోలను చేశారని అందరూ చెబుతుంటారు. అసలు పనైపోయిం ది.. ఇంటికి వెళ్లిపోదాం.. అనుకున్న వారిని కూడా.. దాసరి నటులను చేశారు. ఇలానే.. నరసింహరాజుతో తీసిన సినిమా కూడా సూపర్ హిట్ కొట్టింది.
ఇదిలావుంటే.. శ్రీవిద్య తో తర్వాత..దాసరి మరో సినిమా చేయాలని అనుకున్నారు కానీ.. కుదరలేదు. ఆమె అభినయం బాగున్నా.. బొద్దుగా ఉందన్న కారణంగా.. నిర్మాతలు ముందుకు రాలేదు. దీంతో శ్రీవిద్య-దాసరి కాంబినేషన్ ముందుకు సాగలేదు. ఈమె స్థానంలో దాసరి మరో హీరోయిన్‌ను పరిచయం చేశారు. ఇదీ.. సంగతి..!