సాధారణంగా దర్శకరత్న దాసరి నారాయణ రావు.. ఎప్పుడూ డబ్బింగ్ సినిమాల జోలికి పోయే వారు కాదు. తనే సొంతగా కథ లు రాసుకుని.. కొంత చిత్రీ పట్టి.. వాటినే సినిమాలుగా తీసుకునేవారు. అవి సూపర్ హిట్లు కొట్టేవి. దాసరి ఫస్ట్ పిక్చర్ తాతా మనవడు సినిమా కూడా ఆయన కలం నుంచి జాలువారిందే. ఆ సినిమాలో ఎన్నడూ లేని విధంగా హాస్య నటుడు రాజబాబు ను హీరోగా పెట్టి సూపర్ హిట్ కొట్టారు.
అయితే.. 1975 సమయంలో తమిళంలో వచ్చిన అపూర్వరాగంగళ్ అనే సినిమా అక్కడ వరుసగా రెండేళ్లు ఆడింది. అయితే.. ఈ సినిమా కథను రాసింది బాలచందర్. కథ, కథనం.. అంతా కూడా ప్రేక్షకులను ఉత్కంఠగా ముందుకు తీసుకువె ళ్తుంది. ఈ సినిమా గురించిన తెలిసిన తర్వాత.. దాసరి నారాయణరావు.. దీని హక్కులు కొనేశారు. నిజానికి ఆయన దగ్గర ఆ సమయంలో ఈ సినిమాను రీమేక్ చేసేంత డబ్బులేదు.
అప్పుడప్పుడే ఆయన దర్శకుడిగా ఎదుగుతున్నారు. అయినా.. బాలచందర్‌పై నమ్మకం.. కథ బాగుండడంతో దాసరి కొనేశారు. చివరకు అనేక మంది నిర్మాతలను కలిసారు. కానీ, ఈ సినిమాలో చిన్నవయసు వ్యక్తి పెద్ద వయసు మహిళతో ప్రేమలో పడతారు. అప్పటికే ఆమెకు వివాహం జరిగి.. భర్త నుంచి దూరంగా ఉంటుంది. అయినా.. ఆమెను ప్రేమిస్తున్నానంటూ అతను వెనుక బడతాడు.
చివరికి ఏం జరుగుతుందనేది స్టోరీ. అయితే.. ఈ కథ విన్నాక చాలా మంది నిర్మాతలు వద్దులే.. ఇది మనకు నప్పుదు. మన వాళ్లు ఇలాంటి కథలకు కనెక్ట్ కాలేరు. అని తప్పుకొన్నారు. దీంతో ఆరు మాసాలు వేచి చూడాల్సి వచ్చింది. ఓ సందర్భంగా దాసరికి మిత్రుడు కే. రాఘవ అని..ఒకాయన.. ఈ విషయం తెలుసుకున్నారు. దీంతో ఆయనను సంప్రదించి నేనున్నాను అంటూ.. ముందుకు వచ్చారు.దీంతో సినిమా ట్రాక్ ఎక్కింది.
ఈ సినిమానే తెలుగు చిత్ర సీమలో అప్పట్లో అత్యంత తక్కువ బడ్జెట్‌లో 10 రెట్లు ఆదాయం సంపాయించిన సినిమాగా.. థియేటర్లదగ్గర తొక్కిసలాట జరిగి పోలీసులను పెట్టాల్సిన సినిమాగా రికార్డు సృష్టిందే. అదే.. శివరంజని. శ్రీవిద్య, నరసింహరావు, మోహన్‌బాబు, కైకాల సత్యనారాయణల మధ్య సాగే.. ఈ సినిమా.. సూపర్ హిట్ కొట్టింది. ఏకంగా విజయవాడ దుర్గా కళామందిరంలో ఏడాది పాటు ఆడిన సాంఘిక సినిమాగా గుర్తింపు పొందింది. ఇది.. దాసరి నారాయణరావు దర్శకత్వ ప్రతిభకు, ఆయన కలం నుంచి జాలువారిని పాటలకు పసిడి సింహాసనం పరిచింది.