అక్కినేని ఫ్యామిలీకి గత కొంత కాలంగా టైం బాగా బ్యాడ్‌గా నడుస్తోంది. తండ్రి నాగార్జున, ఇద్దరు కొడుకులు నాగచైతన్య, అఖిల్ నటిస్తోన్న సినిమాలు అన్నీ డిజాస్టర్లు అవుతున్నాయి. నాగార్జున ది ఘోస్ట్, చైతు థ్యాంక్స్, ఇటు అమీర్‌ఖాన్‌తో కలిసి చేసిన లాల్‌సింగ్ చద్దా, తాజాగా వచ్చిన అఖిల్ ఏజెంట్ సినిమాలు అన్నీ ఒకదానిని మించిన డిజాస్టర్లు మరొకటి అవుతున్నాయి.
తాజాగా నాగచైతన్య కస్టడీ సినిమా చేశాడు. బంగార్రాజు సినిమా తర్వాత చైతు, కృతిశెట్టి జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు ఈ సినిమాకు దర్శకుడు. శ్రీనివాస్ చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అరవింద్ స్వామి విలన్‌గా నటించగా, శరత్‌కుమార్, సంపత్‌రాజ్, ప్రియమణి తదితరులు నటించారు.
ఇక సెన్సార్ బోర్డు నుంచి యూ / ఏ సర్టిఫికెట్ సొంతం చేసుకున్న కస్టడీకి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కస్టడీ ఫస్ట్ కాపీ ప్రసాద్ ల్యాబ్స్‌లో కొందరు సినీ ప్రముఖులకు వేశారట. సినిమా చూసిన వారందరూ చాలా పాజిటివ్‌గా స్పందించారని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఫస్ట్ 20 నిమిషాలు చాలా కూల్‌గా, ఫ్లజెంట్‌గా సాగుతుందట. ప్రేక్షకులు స్టార్టింగ్ నుంచే సినిమాలో లీనమయ్యేలా ఉంటుందట.
ఇక అరవింద్ స్వామి ఎంట్రీతో సినిమా మరో రేంజ్‌కు వెళ్లిపోతుందని.. నాగచైతన్య తన పాత్రలో అలా ఒదిగిపోయాడని చెపుతున్నారు. నాగచైతన్య తర్వాత అరవింద్ స్వామి పాత్ర సినిమాకే హైలెట్‌గా ఉంటుందని.. కృతిశెట్టి పాత్రకు మంచి స్కోప్ దక్కిందని అంటున్నారు. ఇక చివరి 40 నిమిషాల ఆట చూస్తుంటే గూస్‌బంప్స్ మోత మోగిపోయేలా ఉంటుందట.
సాధారణంగా ఏ సినిమాలో అయినా హీరో, విలన్‌ను చంపాలనుకుంటాడు. అయితే ఈ సినిమాలో హీరోకు విలన్ చావకుండా.. చివరి వరకు కాపాడుకునే టార్గెట్టే ఉంటుంది. దీనిని చైతు ఎలా సక్సెస్ చేశాడు ? అన్నది చివరి వరకు ఉత్కంఠగా ఉంటుందని చెపుతున్నారు.