అక్కినేని నాగచైతన్య ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఈగర్ గా వెయిట్ చేసిన సినిమా “కస్టడి”. తమిళ్ దర్శకుడు వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయింది . తమిళ్ – తెలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ షో టాక్ బయటకు వచ్చేసింది. ఈ క్రమంలోని సినిమాకి సంబంధించిన రివ్యూస్ చెబుతూ జనాలు నాగచైతన్యను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. ఈ సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ తానై పోషించాడు నాగచైతన్య అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు .
మరి కొంతమంది సినిమాకి శివ క్యారెక్టర్ బేస్ అంటూ ఆ క్యారెక్టర్ లేకపోతే సినిమా లేదు అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన కృతి శెట్టి రేవతి పాత్రలో మెరిసింది . తెరపై శివ – రేవతి రొమాన్స్ బాగా వర్కౌట్ అయ్యింది. ప్రేమ చాలా హెల్తీగా ముందుకెళ్లిందని .. హెల్తీ రొమాన్స్ తో వెంకట్ ప్రభు ఆకట్టుకున్నాడని చెప్తున్నారు. అయితే సినిమాలో హీరో ఎలివేషన్స్ కంటే విలన్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాడు డైరెక్టర్ వెంకట్ ప్రభు అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా సినిమాలో అరవింద స్వామికి నాగచైతన్య కి మధ్య సీన్స్ లో ఎక్కువగా అరవింద్ స్వామి పైనే ఫోకస్ చేశాడని .. నాగచైతన్యను డమ్మీ చేశాడని అంటున్నారు .
అంతేకాదు నాగచైతన్య ఈ సినిమాల్లో టు గుడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారని కామెంట్స్ చేస్తున్నారు అక్కినేని ఫ్యాన్స్ . అలా ఫస్ట్ ఆఫ్ మొత్తం స్లో నరేషన్తో ముందుకు సాగిన ఈ సినిమా సెకండ్ హాఫ్ లో మాత్రం మంచి సస్పెన్స్ సిన్స్ పెట్టి జనాలకు హైప్ ఇచ్చారని ఓవరాల్గా యావరేజ్ టాక్ అయితే కస్టడీ సినిమా నమోదు చేసుకుంది . ఈ క్రమంలోని ఒకవేళ విలన్ కన్నా కూడా మరికొన్ని ప్రిఫరెన్స్ సీన్స్ శివ క్యారెక్టర్ కి ఇచ్చుంటే డైరెక్టర్.. సినిమా ఇంకొంచెం పాజిటివ్ టాక్ దక్కించుకునేదని .. ఇప్పుడు అరవింద్ స్వామికి ఆ క్రేజ్ అంత వెళ్ళిపోయింది అని చెప్పుకొస్తున్నారు. సెకండ్ హాఫ్ లో అరవింద్ స్వామికి శివ క్యారెక్టర్ బ్యాక్ గ్రౌండ్ కి పెట్టిన లింక్ చాలా బాగుంది అంటూ జనాలు మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే వెంకట్ ప్రభు డైరెక్షన్ పై జనాలు హ్యూజ్ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి నాగచైతన్య “కస్టడి” ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో..?