అక్కినేని హీరో నాగచైతన్య – సమంత మధ్య విడాకుల తర్వాత చైతు ఏమోగానీ సమంత మాత్రం చాలాసార్లు వారిద్దరి బంధంపై రకరకాల కామెంట్లు చేస్తూ వస్తోంది. ఇద్దరిని ఒకే గదిలో ఉంచితే చుట్టూ కత్తులు, కట్టార్లు లేకుండా చూసుకోవాలని బాలీవుడ్‌కు చెందిన ఒక షోలో చెప్పుకో వచ్చింది. అప్పటినుంచి వీరిద్దరి మధ్య గొడవలకి పెద్ద కారణమే ఉందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే అసలు వీరిద్దరూ అంత శత్రువులుగా మారటానికి కారణం ఏంటన్నది ? ఇప్పటివరకు బయటకు రాలేదు.
చైతు – సమంత ఇద్దరి చర్యలు, ప్రతిచర్యలు ఇప్పటికీ ఒకరిని ఒకరు రెచ్చగొడుతున్నట్టుగానే అనిపిస్తున్నాయి. సమంత సినిమా రిలీజ్ టైం లో చైతు కామ్ గా ఉన్నట్టు కనిపించినా ఆయన ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా సమంతపై కామెంట్లు వేస్తూనే వస్తున్నారు. ఇదంతా చైతుకి తెలిసే జరుగుతున్నట్టుగా సమంత ఆమె అభిమానులు భావిస్తూ ఉంటారు. రీసెంట్గా శాకుంతలం సినిమాకు ప్లాప్ రావడానికి కారణం చైతుతో పాటు అక్కినేని అభిమానులు అన్న గాసిప్పులు కూడా వైరల్ అయ్యాయి.
ఇప్పుడు చైతు సినిమా వంతు వచ్చింది. ఇక సమంత గేమ్ స్టార్ట్ చేసినట్టుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు దర్శనమిస్తున్నాయి. నాగచైతన్య – వెంకట్‌ప్రభు కాంబినేషన్లో తెరకెక్కిన కస్టడీ సినిమా ఈ నెల 12న తెలుగు, తమిళ భాషలో రిలీజ్ అవుతుంది. ఓవైపు సినిమా ప్రమోషన్లు భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు.
ఇంటర్వ్యూలో చైతు మాట్లాడుతూ నా లైఫ్ లో ఇప్పటివరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు.. బాధపడలేదు. నాకు ఎదురైన ప్రతి సంఘటన నుంచి నేను ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉన్నాను.. కొన్ని సినిమా కథల విషయంలో బాధపడ్డాను.. ఆ సినిమా కథలపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయానే అని అనుకుంటూ ఉంటాను. అలాగే కొన్ని సినిమాలతో అభిమానులను ఇబ్బంది పెట్టాను అని బాధపడుతూ ఉంటాను అని చైతు చెప్పిన ఈ మాటలు వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంలో సమంత తన ఇన్‌స్టాలో టార్చర్ టైం స్టార్ట్ అంటూ ఓ పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి మధ్య కవింపు చర్యలు తగ్గలేదని టాక్ అయితే మొదలైంది. పైగా సమంత రికవరీ పేరుతో ఐస్ లో తాను మునిగిపోయి ఉన్న పిక్ షేర్ చేసింది. యాక్షన్ మోడ్ ఆన్ అంటూ రెండు బాంబు ఎమోజీలను కూడా జత చేయడంతో ఇది కచ్చితంగా చైతుని ఉద్దేశించి ఉందని చైతు ఫ్యాన్స్ ఆరోపణలు చేస్తున్నారు. అంటే చైతు కస్టడీ సినిమాకు మీడియా సమావేశాలు, ఇంటర్వ్యూలు ఇవ్వాల్సి ఉంది. దీనిని ఆమె టార్చర్ టైంగా పోల్చిందన్న గుసగుసలు సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. దీంతో ఇద్దరి మాటల్లో అసలు ఎవరి మాటలు నమ్మాలో ఎవ్వరికి తెలియట్లేదు.