అన్నగారు ఎన్టీఆర్తో దాసరి నారాయణరావు పలు చిత్రాలు తీశారు. దాసరి దిగ్గజ దర్శకుడు అనే విషయం తెలిసిందే. ఆయన ఎప్పుడూ కూడా.. కథపైనే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చేవారు. హీరోయిన్, వాళ్ల శృంగారం వంటివాటిని పెద్దగా పట్టించుకునేవారుకాదు. అంతేకాదు.. కథా బలం ఉంటేనే షూటింగు చేయాలని అనేవారు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో పేద్ద వ్యక్తిగా చలామణి అయ్యారు. అనేక వివాదాలకు పరిష్కారం కూడా చూపించారు.
నిజానికి ఈవిషయంలో అన్నగారి నుంచి దాసరికి ప్రోత్సాహం ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత.. ఇప్పటి వరకు ఇలాంటి అవకాశం ఎవరికీ దక్కలేదు. దిగ్గజ దర్శకులు ఉన్నా కూడా.. ఎవరూ కూడా ఇండస్ట్రీకి పెద్దగా ముందుకు రాలేక పోయారు. సరే.. విషయానికి వస్తే.. సర్దార్ పాపారాయుడు సినిమా అనుకున్నాక.. దాసరి.. ఎన్టీఆర్ను కలిశారు. ఆ సమయంలో యువతకు మసాలా పాటలు కావాలి.. హీరోయిన్ నడుము ఎలివేట్ అయితే.. ఇంకా బాగుంటుందనే టాక్ నడుస్తోంది.
వాస్తవానికి 1980లలో ఇదే పరిస్థితి ఉంది. హీరోయిన్ నాభిఅందాలను అప్పుడప్పుడే చూపించడం ప్రారం భించారు. తర్వాత..నడుము.. ఈ రెండు సినిమాల్లో మస్ట్. ఇదే విషయం అన్నగారు కూడా ప్రస్తావించారు. హీరోయిన్ ఎవరని అనుకున్నారు? అని గంభీరంగా ప్రశ్నించారు. అప్పటికే శ్రీదేవిని నిర్ణయించుకున్న దాసరి.. ఆమేరకు కథను కూడా రెడీ చేసుకున్నారు. అయితే..అన్నగారి ముందు చెబితే ఏమనుకుంటారో.. అని.. ఇంకా ఏమీ అనుకోలేదు అన్నారు.
అయితే.. శ్రీదేవిని తీసుకోండి.. కుర్రకారుకు మజా ఇస్తారు మేడం
అని అన్నగారు అనేశారట. దీంతో అన్యాపగా.. అంటే.. మన సినిమాలో అలాంటి సీన్లేవీ ఉండవండి అన్నగారు
అనేశారట దాసరి. అలాంటి సీన్లు అంటే.. మీ అర్థం వేరే అయి ఉంటుంది. కానీ, నేటి యువత నడుం చూడాలని.. ముచ్చట పడుతున్నారు గా మీరు కాదంటారా? అని ప్రశ్నించారట.
ఇక, అన్నగారితో వాదన ఎందుకని.. దాసరి శ్రీదేవిని ఓకే చేశారు. అయితే.. ఎక్కడా అలాంటి సీన్లు లేకపోవడం గమనార్హం. 100 రోజుల ఫంక్షన్లో ఇదేవిషయం ప్రస్తావిస్తూ.. హీరోయిన్ నడుము చూపించి డబ్బులు చేసుకుంటారని అనుకున్నా.. దాసరివారు.. చిత్రమైనవారు.. చిత్రాన్ని చూపించే డబ్బులు చేసుకున్నారు
అని అన్నగారుకితాబిచ్చారు.