నందమూరి నటసింహ బాలకృష్ణ అంటే అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలు పిచ్చపిచ్చగా ఆరాధిస్తారు. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టపడే వీరంతా ఇప్పుడు ఆయన తనయుడిపై కూడా అంతే అభిమానం చూపిస్తారు. ఇక బాలయ్య వరుసగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
ప్రస్తుతం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తోన్న సినిమా కూడా దసరాకు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇలా ఉంటే గత ఏడాది కాలంలో బాలయ్య సినిమాల మార్కెట్ భారీగా పెరగటం ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. బాలయ్య తన తండ్రి బయోపిక్ సినిమాలు కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించారు. వాస్తవంగా ఆ రెండు సినిమాలు అంత తీసిపారేసేదగ్గ సినిమాలు కూడా కాదు.
అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రెండు సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి. ఇక ఈ రెండు సినిమాల తర్వాత వచ్చిన రూలర్ సినిమా సైతం అట్టర్ ప్లాప్ అయ్యింది. మధ్యలో కరోనాతో రెండేళ్లు గ్యాప్ వచ్చింది. ఆహా ఓటిటి అన్ స్టాప్టబుల్ తో బాలయ్య దుమ్మురేపేశాడు. ఆ తర్వాత వచ్చిన అఖండ సినిమాకు తెలుగు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా రు. 200 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టింది. అమెరికాలో సైతం ఈ సినిమా దుమ్ము రేపేసింది.
ఒకప్పుడు బాలయ్య సినిమాలు వస్తున్నాయంటే అమెరికాలో పెద్దగా పట్టించుకునే వారు కాదు. గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు మాత్రమే మంచి వసోళ్లు సాధించాయి. అయితే అఖండ అమెరికాలో తిరుగులేని సక్సెస్ సాధించింది. ఇక తాజాగా రీ-రిలీజ్ అయిన చెన్నకేశవరెడ్డి సినిమా కూడా అక్కడ అదిరిపోయే వసూళ్లు రాబట్టి అందరికీ షాక్ ఇచ్చింది. సంక్రాంతికి వచ్చిన వీర సింహారెడ్డి కూడా అమెరికాలో భారీ విజయంతో పాటు టు మిలియన్ డాలర్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
గత ఏడాది కాలంలో అమెరికాలో బాలయ్య మార్కెట్ విపరీతంగా పెరిగింది. అన్ స్టాపబుల్ షో ద్వారా బాలయ్యకు ఓవర్సీస్ మార్కెట్ పెరిగిందా..? లేదా అఖండ నుంచి పెరిగిందా..? అన్నది అయితే తెలియటం లేదు గాని, బాలయ్య మార్కెట్ మాత్రం చాలా బాగా ఇంప్రూవ్ అయ్యింది. బాలయ్య ప్రస్తుతం చేస్తున్న అనిల్ రావిపూడి సినిమాకు ఏపీ, తెలంగాణతో పాటు ఓవర్సీస్ నుంచి భారీ బిజినెస్ డీల్ ఆఫర్లు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇక మరి ఈ సినిమాతో కూడా బాలయ్య ఎలాంటి రికార్డులు సృష్టిస్తాడో ?చూడాలి.