ఒక్కొక్క హీరోయిన్‌కు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. కొందరు ఔట్ డోర్ షూటింగులను ఇష్టపడేవారు. ఇంకొం దరు ఇన్‌డోర్ షూటింగులను ఇష్టపడేవారు. మరికొందరు షరతులు పెట్టేవారు. నేను ఇండోర్ షూటింగులు అయితే.. బుక్ చేసుకోండి.. లేకపోతే.. లేదు. అని చెప్పేవారు. ఎందుకంటే.. వారికి ఉన్న కుటుంబ బాధ్యత లు ఇతరత్రా ఇబ్బందులు చెపేవారు. నిజానికి చెప్పాలంటే.. ఒకప్పటి సినిమాల్లో ఎక్కువగా ఇండోర్ షూటింగులే ఎక్కువగా ఉండేవి.
పెద్ద పెద్ద స్టూడియోలు.. వాటిలోనే సెట్టింగులు వేసి.. అక్కడే విదేశీ వాతావరణాన్ని సృష్టించేవారు. అంతే కాదు.. పెద్ద పెద్ద అంగళ్లలో షూటింగు చేయాలన్నా.. పొలాల్లో షూటింగులు చేయాలన్నా.. కూడా స్టూడి యోలనే వాడుకునేవారు. అప్పటి సినిమాలు చూస్తే..ఈ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయినా.. ఎక్కడా కూడా ఆ తరహా అసంతృప్తి ప్రేక్షకుడికి కలిగేది కాదు. దీంతో మెజారిటీ హీరోయిన్లు.. హీరోలు.. ఇండోర్ షూటింగులకు మాత్రమే అలవాటు పడ్డారు.
దీనివల్ల.. వారు ఎక్కువ సమయం కలిసి వచ్చేదని కూడా చెప్పేవారు. అయితే.. ప్రత్యగాత్మ దర్శకుడిగా వచ్చిన తర్వాత.. విదేశాలు సహా.. రాజస్థాన్ , మైసూరు, ఢిల్లీ, జమ్ము కశ్మీర్ వంటి ప్రాంతాల్లోనూ షూటింగులు చేసేవారు. అయితే.. అంజలీదేవి మాత్రం.. తాను అలా రాలేనని.. దీనికి ఇష్టమైతేనే సినిమా చేయాలని ఆమె చెప్పేవారు. దీనికి కారణం.. తన తల్లి బాధ్యత తనే చూసుకోవాలని అనుకునేవారు.
ఇక, భానుమతి కూడా అలానే చెప్పేవారు. ఈ గోలంగా ఎవరు పడతారు? అదేదో ఇక్కడే ఒక సెట్ వేస్తే.. సరిపోతుంది.. అని తెగేసి చెప్పేవారు. ఈ క్రమంలోనే కొత్తవారికి ప్రత్యగాత్మ అవకాశం ఇచ్చారు. వీరు అవకాశాలు పోగొట్టుకున్నారని అనుకున్నా..వారి సినిమాల్లో వారు బిజీగా ఉండేవారు.