ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాంకర్ విష్ణు ప్రియ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్క్ర్లేదు. రీసెంట్ గానే వాళ్ళ అమ్మగారిని పోగొట్టుకొని చాలా ఎమోషనల్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ బాధ నుండి కోలుకోవడానికి ట్రై చేస్తుంది. కాగా పలు కవర్ సాంగ్స్ తో..షోలతో బిజీ బిజీగా గడుపుతున్న యాంకర్ విష్ణుప్రియ.. రీసెంట్ గానే ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్త్ సెన్స్ సీజన్ సెవెన్ లో పాల్గొనింది.
ఈ క్రమంలోనే జెడి చక్రవర్తి పై హాట్ కామెంట్స్ చేసింది . “నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని .. ఆయనతో కలిసి వర్క్ చేస్తున్న టైంలో ఆయన బిహేవియర్ కి ఇంప్రెస్ అయిపోయానని.. వాళ్ళ కుటుంబం ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని.. ఈ విషయం ఆయనకి కూడా చెప్పానని ఓపెన్ గా చెప్పుకొచ్చింది. అయితే ఓంకార్..” మీ మధ్య ఏ చాలా గ్యాప్ ఉంది ..నీకు ప్రాబ్లం లేదా..? అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటూ ఓపెన్ గా చెప్పేసింది.”.
కాగా అప్పట్లో విష్ణు ప్రియ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . కాగ రీసెంట్గా సుమ అడ్డ షోకి వచ్చిన విష్ణు ప్రియ మరోసారి టంగ్ స్లిప్ అవుతూ హాట్ కామెంట్స్ చేసింది. టాస్క్ లో భాగంగా “సుమ పెళ్లి అనగానే మీకు గుర్తు వచ్చేది ఏంటి ..?” అంటూ అడిగింది . ఈ క్రమంలోనే పలు రకాల ఆన్సర్స్ ఇస్తూ యాంకర్ విష్ణుప్రియ టక్కున శోభనం అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది . అక్కడ అంత మంది ముందు అలా ఓపెన్ గా విష్ణు అలా చెప్పడంటొ సుమ కూడా షాక్ అయిపోయింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వేణు , ధనరాజ్ సైతం షాక్ అయ్యారు . అంతమంది ముందు అలా విష్ణుప్రియ పచ్చిగా బోల్డ్ గా ఆన్సర్ ఇవ్వడం ..అందరికి షాకింగ్ కి గురి చేసింది .ఈ క్రమంలోనే విష్ణు ప్రియ పూర్తిగా రెచ్చిపోయిందని ..అవకాశాల కోసం ఏదైనా మాట్లాడడానికి రెడీగా ఉంది అని చెప్పుకొస్తున్నారు . మరి కొందరు షో ని కామెడీగానే చూడండి అంటూ విష్ణుప్రియ అని సపోర్ట్ చేస్తున్నారు . దీంతో విష్ణు చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..!!