Newsఅందుకే "సెక్స్ ఎడ్యుకేషన్" చాలా అవసరం .. యాంకర్ రష్మీ సంచలన...

అందుకే “సెక్స్ ఎడ్యుకేషన్” చాలా అవసరం .. యాంకర్ రష్మీ సంచలన పోస్ట్ వైరల్..!!

జబర్దస్త్ యాంకర్ గా పాపులారిటీ సంపాదించుకున్న రష్మీ .. ఎంత ఓపెన్గా ఆలోచిస్తుందో ..అంతే ఓపెన్ గా ఆన్సర్ ఇస్తుంది . తన అనుకున్న విషయాలని ఉన్నది ఉన్నట్లు టంగ్ స్లిప్ అవ్వకుండా చెప్పేస్తుంది రష్మీ . ఈమె ఓ అనిమల్ లవర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే . ఈ జంతు ప్రేమికురాలు జంతువులను ఎవరైనా హింసిచ్చినా ..? వాటిని టార్చర్ చేసినా.. వెంటనే సోషల్ మీడియా వేదికగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంది.

అంతేకాదు ఆడపిల్లల్ని – అమాయకులని ఎక్కడైనా హింసిస్తే దానిపై స్పందిస్తూ తన అభిప్రాయం చెప్పుకొస్తుంది . రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టుకువచ్చింది రష్మి. తాజాగా ఆమె దారుణ సంఘటన మీద పోస్ట్ పెట్టుకువచ్చింది. రజస్వల అయిన 12 ఏళ్ల బాలికను తప్పుగా అర్థం చేసుకున్న ఓ వ్యక్తి హత్య చేశాడట . బాలిక అక్రమ సంబంధం పెట్టుకుందా..? అన్న అనుమానంతో భావించి అతి క్రూరంగా నరికి చంపేశారట .

అయితే ఇది కేవలం సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లనే అంటూ రష్మి గౌతమ్ చెప్పుకొస్తున్నారు . కనీసం ప్రాథమిక అవగాహన లేకపోవడం వల్లనే ఇలాంటి ఘోరాలు జరుగుతున్నాయి అంటూ రష్మి ఓపెన్ గా చెప్పుకొచ్చారు . దీంతో రష్మీ పెట్టిన బోల్డ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఏది ఏమైనా రష్మి చెప్పింది ఒకందుకు నిజమైన మరొక అందుకు సమాజం చెడిపోవడానికి కారణం అవుతుంది అంటూ జనాలు అభిప్రాయపడుతున్నారు. కాగా రష్మీ కెరీర్ విషయానికొస్తే కొన్ని ప్లస్లు కొన్ని మైనసులతో సాగిపోతుంది. త్వరలోనే ఈ అమ్మడు పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. అయితే ఆమె ఎవరిని చేసుకుంటుంది ఎప్పుడు చేసుకుంటుంది అన్నది మాత్రం ప్రశ్నార్థకంగానే మిగిలింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news