అల్లరి నరేశ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఉగ్రం’ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ‘నాంది’ వంటి బ్లా్క్ బస్టర్ హిట్ మూవీని తెరకెక్కించిన విజయ్ కనకమేడలతో మరోసారి నరేశ్ చేతులు కలపడంతో, ఉగ్రం మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి. ఇంట్రెస్టింగ్ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్ తో ఈ అంచనాలను రెట్టింపు చేసిన ఉగ్రం మూవీ, నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఉగ్రం మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
సీఐ శివ కుమార్(అల్లరి నరేశ్) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. డ్యూటీ కోసం ఎంతవరకైనా వెళ్లే క్యారెక్టర్. అమ్మాయిలను వేధించే నలుగురు గంజాయి ముఠాను అరెస్ట్ చేస్తాడు శివ కుమార్. వారు జైలు నుండి బయటకు వచ్చి శివకుమార్ భార్య అపర్ణ(మిర్నా మీనన్)ను భయపెడతారు. కట్ చేస్తే.. శివకుమార్ ఆ నలుగురిలో ముగ్గురిని చంపేస్తాడు. కానీ ఒకతను శివకుమార్‌కు దొరకకుండా పారిపోతాడు. ఈ క్రమంలోనే శివకుమార్ ఫ్యామిలీ కారు యాక్సిడెంట్‌కు గురవుతుంది. ఈ ప్రమాదంలో శివకుమార్ గతం మర్చిపోతాడు. అతడి భార్య, కూతురు కనిపించకుండా పోతారు. వారు ఏమయ్యారు.. వారిని కిడ్నాప్ చేసింది ఎవరు.. గంజాయి ముఠాతో ఈ కిడ్నాప్‌కు ఏమైనా సంబంధం ఉందా.. అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ:
దర్శకుడు విజయ్ కనకమేడల ఎంచుకునే కథలు సమాజంలో తరుచూ మనకు కనిపించేవే. నాంది సినిమాలో ఆయన చూపెట్టిన కథ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయగా, ఇప్పుడు ఉగ్రం సినిమాలోని కథ సగటు ప్రేక్షకుడిని ఖచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి.. అతడి నిజాయితీ ఎలాంటి కష్టాలను తెచ్చిపెట్టింది.. తన కుటుంబం కోసం ఆ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఎంతవరకు వెళ్తాడు అనేది మనకు ఉగ్రం మూవీలో చాలా చక్కగా చూపెట్టారు.
ఉగ్రం కథనం విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లోనే చాలా మంచి మార్కులు కొట్టేశాడు ఈ డైరెక్టర్. సినిమా ఓపెనింగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కథలోకి లీనమవుతున్న తీరు ప్రేక్షకులకు సమయాన్ని మరిచిపోయేలా చేస్తుంది. అయితే, కొన్ని సెంటిమెంటల్ సీన్స్ మరీ ఎక్కువగా అనిపిస్తాయి. ఇక కారు యాక్సిడెంట్.. ఆ తరువాత అల్లరి నరేశ్ జీవితం ఎలా మారిపోయిందనే అంశాలను మనకు ఫస్టాఫ్‌లో చక్కగా చూపెట్టారు. ఓ ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకుల్లో సెకండాఫ్‌పై ఆసక్తిని క్రియేట్ చేస్తాయి.
ఫస్టాఫ్‌తో శాటిస్ఫై అయిన ఆడియెన్స్‌కు సెకండాఫ్ కొంతమేర నిరాశను మిగిలిస్తుంది. యాక్షన్ డోస్ మరీ ఎక్కువగా ఉండటం ప్రేక్షకులకు నచ్చదు. తన ఫ్యామిలీ కోసం హీరో చేసే పోరాటం కూడా రొటీన్‌గా మారిపోతుంది. చక్కటి ఫస్టాఫ్‌తో స్టార్ట్ అయిన సినిమా సెకండాఫ్‌లో ట్రాక్ తప్పుతుంది. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ బలంగా ఉండి ఉంటే, ఈ సినిమా రిజల్ట్ వేరేలా ఉండేది.
ఓవరాల్‌గా ఓ రొటీన్ కథను దర్శకుడు హ్యాండిల్ చేసిన విధానం, అతడు సినిమా కథను ఎగ్జిక్యూట్ చేసిన తీరు ప్రేక్షకులను మెప్పించినా, కొన్నిచోట్ల సినిమా మిస్‌ఫైర్ అయ్యిందని అనిపిస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్:
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సీఐ శివకుమార్‌గా అల్లరి నరేశ్ ఈ సినిమాకు మేజర్ అసెట్ అని చెప్పాలి. అతడు మరోసారి నెక్ట్స్ లెవెల్ పర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్, యాక్షన్ సీక్వెన్స్‌లలో అతడి నటన సూపర్. ఇక హీరోయిన్ మిర్నా మీనన్‌కు నటనపరంగా పెద్దగా స్కోప్ లేని పాత్ర లభించింది. మిగతా క్యారెక్టర్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోతాయి.
టెక్నికల్ డిపార్ట్మెంట్:
దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాను మలిచిన తీరు సాధారణ ప్రేక్షకుడిని మెప్పించేలా ఉంటుంది. అతడు రొటీన్ కథకు మరికొన్ని ట్విస్టులు యాడ్ చేసి ఉంటే బాగుండేది. యాక్టర్స్ నుండి తనకు ఎంత యాక్టింగ్ కావాలో, అంతా తీసుకున్నాడు. సినిమాను సైడ్ ట్రాక్ కాకుండా జాగ్రత్తపడ్డాడు. శ్రీచరణ్ పాకాల సంగీతం కొంతమేర ఆటకట్టుకుంది. బీజీఎం పర్వాలేదనిపించినా, పాటలు మాత్రం వేస్ట్. ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకు సూపర్‌గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్స్ ఓకే.
చివరగా:
ఉగ్రం – అల్లరి నరేశ్ వన్ మ్యాన్ షో!
రేటింగ్:
2.5/5