మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ పెద్దగా ఎప్పటికప్పుడు నాలుగు మంచి మాటలు చెపుతూ.. ఇండస్ట్రీ గాడి తప్పకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఈ యేడాది సంక్రాంతికి చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా చిరు ఓ విషయం చెప్పారు. అయితే అలా చెప్పినందుకే అందరూ ఆయన్ను ట్రోల్ చేశారు. కొందరు విమర్శించారు కూడా…
అయితే తాజాగా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్ద డిజాస్టర్ అవ్వడంతో ఇప్పుడు అందరూ నాడు చిరంజీవి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటున్నారు. నాడు చిరు నిజం చెపితే తిట్టుకున్నాం.. కానీ ఇప్పుడు ఏజెంట్ విషయంలో ఆయన మాటలు నూటికి నూరు శాతం నిజం అయ్యాయని అంటున్నారు.
నాడు చిరంజీవి మాట్లాడుతూ యంగ్ డైరెక్టర్లు షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి ముందే బౌండెడ్ స్క్రిఫ్ట్ రెడీ చేసుకోవాలని… మధ్యలో ఇష్టం వచ్చినట్టు సీన్లు మార్చేసి.. షూటింగ్ చేసుకుంటూ వెళితే సీన్లు సరిగా రావని.. నిర్మాతకు బడ్జెట్ బర్డెన్ అవుతుందన్నారు. యంగ్ డైరెక్టర్లు అప్పటికప్పుడు స్క్రిఫ్ట్ రెడీ చేసుకుంటూ సీన్లు తీసే పద్ధతి మానుకోవాలని స్మూత్ వార్నింగ్లా ఇచ్చారు.
దీంతో కొందరు చిరును టార్గెట్గా చేసుకుని మాట్లాడారు. అయితే ఇప్పుడు ఏజెంట్ రిజల్ట్పై నిర్మాత అనిల్ సుంకర ట్వీట్ చేశారు. బౌండెడ్ స్క్రిఫ్ట్ లేకుండా సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడమే ఈ సినిమా పరాజయానికి ప్రధాన కారణం అని… ఈ పరాజయానికి పూర్తి బాధ్యత మాదే అని ప్రకటించుకున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది ఏజెంట్ విషయంలో నాలుగు నెలల క్రితం చిరంజీవి చెప్పిందే నిజం అయ్యింది కదా అని చర్చించుకుంటున్నారు.
ఇప్పటకీ అయినా యువ దర్శకులు చిరంజీవి చెప్పిన మాటలు బుర్రకు ఎక్కించుకుని బౌండెడ్ స్క్రిఫ్ట్ పూర్తయ్యాకే సెట్స్ మీదకు వెళితే నిర్మాతలకు భారం ఉండదు.. ఇటు సినిమాలు కూడా మంచిగా సక్సెస్ అవుతాయి.