ఊర్వశి
బిరుదుతో తెలుగు చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన నటీమణి శారద. ఆమె సినీ రంగ ప్రవే శం చాలా చిత్రం. ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకుని.. సమాజానికి ఏదైనా చేయాలని భావించిన ఆమె.. అనూ హ్యంగా బాబాయి చొరవ కారణంగా.. సినిమాల వైపు మళ్లారు. అయితే.. తన సినిమాల్లోనూ సమాజానికి మేలు చేసే పాత్రలు ధరించాలని ఉవ్విళ్లూరారు. అయితే.. ఈ ఛాన్స్ చాలా ఆలస్యంగా లభించింది.
ప్రతి విషయాన్నీ.. చాలా కూలంకషంగా పరిశీలించి.. నిర్ణయం తీసుకునే శారద తర్వాత కాలంలో.. దర్శకు లు.. రచయితలను ప్రభావితం చేశారు. ఎందుకంటే.. తన సినిమాలను తాను డామినేట్ చేసే స్థాయికి ఎది గారు. స్వాతి సినిమా శారద జీవితంలో పెద్ద మైలురాయి అనే చెప్పాలి. అక్కడి నుంచి శారదకు అవకాశాలు కోకొల్లలుగా వచ్చాయి. అయితే.. చాలా సీరియస్ పాత్రలు వేయాల్సి వచ్చింది.
ఇది శారదకు కొంత ఇబ్బందిగా మారింది. ఇక, అమ్మ రాజీనామా సినిమా సమయంలో దాసరి నారాయణ రావు.. కథ మొత్తాన్ని శారదను దృష్టిలో పెట్టుకునే చేశారు. అయితే.. ఆమె ముందు నటించేందుకు ఒప్పుకో లేదన్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. పదునైన డైలాగులు కోరుకునే శారద.. ఈ సినిమాలో ఆ తరహా డైలాగుల కోసం పట్టుబట్టారు. దీంతో దాసరి నారాయణరావు తొలిసారి.. తన సినిమాలో తాను సహా వేరే వారితో డైలాగులు రాయించారు.
అమ్మ రాజీనామా సినిమాలో శారద పార్టును తొలిసారి మహారథి రాశారు. మొత్తానికి శారద సినీ జీవితంలో అంతా ఆమెదే పైచేయిగా సాగడం గమనార్హం. రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ.. శారద తనదైన పాత్రను పోషించారు. అవినీతిని సహించేవారు కాదు. ఒకసారి తన కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని.. ఎంపీగా ఉన్న సమయంలో మహారాష్ట్రలో తహశీల్దార్‌పై విరుచుకుపడి వార్తల్లోకి ఎక్కారు.