తెలుగు సినిమా పరిశ్రమలో 1970 – 80వ దశంలో ఎంతో మంది హీరోయిన్ లు స్టార్ హీరోయిన్లుగా రాణించారు. వారిలో తెలుగు అమ్మాయిలు ఉండటం విశేషం. చాలామంది తెలుగు అమ్మాయిలు తెలుగుతోపాటు అటు తమిళంలోనూ ఆ తర్వాత బాలీవుడ్ లోనూ ఒక వెలుగు వెలిగిపోయారు. అలా అప్పట్లో తన అందంతో స్టార్ హీరోయిన్ గా రాణించారు జయప్రద. ముఖ్యంగా కలువల్లాంటి కన్నులు అందమైన మోహం సహజసిద్ధమైన నటనతో జయప్రద ప్రేక్షకులను కట్టిపడేశారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు ఇలా అలనాటి స్టార్ హీరోలు అందరితో కలిసి ఆమె నటించారు.
కృష్ణ – జయప్రద కాంబినేషన్ కు అప్పట్లో ఎంతో క్రేజ్ ఉండేది. వారిద్దరూ కలిసి సినిమా చేశారంటే సూపర్ హిట్. కృష్ణ కూడా ప్రత్యేకంగా దర్శక, నిర్మాతలకు ఫోన్లు చేసి జయప్రద డేట్లు బుక్ చేయమని ముందే చెప్పేవారట.14 ఏళ్ల పైసలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జయసుధ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం. 14 ఏళ్ల వయసులో జయప్రద పాఠశాలలో నాట్య ప్రదర్శన ఇస్తుండగా అప్పటి ప్రముఖ సినీ నటుడు ఎం ప్రభాకర్ రెడ్డి ఆమెను చూసి సినిమాల్లోకి తీసుకువచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె పేరు జయప్రదగా మార్చారు.
ముందు టాలీవుడ్ లో సీనియర్ హీరోలు అందరితో కలిసి నటించి సూపర్ హిట్లు కొట్టిన ఆమె.. ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ లోకి వెళ్ళాక జయప్రద నేషనల్ వైడ్ గా తిరగలేని స్టార్ హీరోయిన్ అయిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన ఆమె కొంతకాలం ఆ పార్టీలోనే ఉన్నారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ లోని సమాజ పార్టీలోకి వెళ్లి రాజ్యసభకు ఎంపిక కావడంతో పాటు రాంపూర్ నుంచి రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఇక గత ఎన్నికలలో బిజెపిలోకి వెళ్లిన జయప్రద ఆ పార్టీ నుంచి లోక్ సభకు పోటీచేసి ఓడిపోయారు. ఒక తెలుగు అమ్మాయి అయి ఉండి నార్త్ లో జాతీయస్థాయి రాజకీయాల్లో రాణించడం నిజంగా గ్రేట్ అని చెప్పాలి.