ఈ టైటిల్ చూసి ఖంగారు పడకండి. వాడేశారు.. అంటేద్వంద్వార్థం కాదు.. బాగా నటింపజేశారు అనట! ఈ విషయాన్ని వై. విజయే ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు. అప్పట్లో కూడా .. ఇప్పుడు మాదిరిగానేస్పైసీ హెడ్డింగులు పెట్టే సినీ పత్రికలు ఎక్కువగా ఉండేవి. నిజానికిచెప్పాలంటే.. సినీ వార్తలు ఇప్పుడు చాలా తక్కువ అంటారు వై. విజయ. ఒకానొక దశలో సినిమా వార్తల కోసమే.. చాలా పత్రికలు స్థాపించారు.
వాటిని ప్రజల్లోకితీసుకువెళ్లేందుకు పోటా పోటీ హెడ్డింగులు పెట్టేవారు. ఇలా ఎక్కువగా ప్రజల్లోకి దూసుకు పోయిన హెడ్డింగ్.. `వై. విజయను ఆయన బాగా వాడేశాడట!అనేది. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించిన వై. విజయ.
వాడేయడం.. అంటే ఏదో అనుకున్నారు. ఆ హెడ్డింగ్ చూసి.. నాకు అభిమాను ల నుంచి విమర్శలు కూడా వచ్చాయి. తలెత్తుకోలేక పోయాను“ అని చెప్పారు.
అంటే.. ఒక హెడ్డింగ్ తారలను ఎంత ఇబ్బంది పెడుతుందో చెప్పడానికి ఇది ఉదాహరణ అన్నారు. అయి తే.. అదే హెడ్డింగు, వార్త.. తనకు ఎన్నో అవకాశాలు తెచ్చి పెట్టిందనడం కొసమెరుపు ఇక, విషయానికి వస్తే.. మంగమ్మ గారి మనవడు సినిమాలో వై. విజయ కీలక రోల్ చేసింది. వ్యాంపు పాత్ర. ఈ సినిమాలో బాయ్యా.. అంటూ.. ఆమెమాట్లాడే తీరు.. ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ జనాన్ని కట్టి పడేసింది.
1984లో వచ్చిన ఈ సినిమా.. తర్వాత.. ఇదే సినిమా దర్శకుడు కోడి రామకృష్ణతో వరుసగా వై. విజయ అనేక సినిమాల్లో పనిచేశారు. ప్రతి సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చింది. అందుకే..వై . విజయను బాగా వాడేశాడు.. వీరి మధ్య ఎఫైర్ అనే యాంగిల్‌లో స్టోరీలు.. వార్తలువచ్చాయి. వ్యాంపు పాత్రలకే కొన్ని సంవత్సరాల పాటు విజయ పరిమితం అయ్యారంటే ఆశ్చర్యం వేసినా..ప్రాణం పోశారని ఆమె అబిమానులు అంటారు.