సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక అడ్డు అదుపు లేకుండా ప్రశ్నించడం మొదలుపెట్టారు జనాలు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో రోజుకు ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇన్నాళ్లు బతికున్న మనుషుల పై ట్రోలింగ్ చేసిన జనాలు ఇప్పుడు చనిపోయిన మనుషుల పై సైతం చేస్తున్నారు. ఎస్ నిన్న మొన్నటి వరకు శ్రీదేవి అంటే దేవతల భావించే జనాలు ఇప్పుడు బోనీకపూర్ ని ఎందుకు రెండో పెళ్లి చేసుకున్నింది అన్న విషయం పెద్ద తలనొప్పిగా మారింది ..?
శ్రీదేవి అందానికి తక్కువ లేదు.. డబ్బు పరంగా కూడా పెద్దగా ఇబ్బంది పడిన పరిస్థితులు లేవు ..మల్టీ టాలెంటెడ్ ..ఇంత టాలెంట్ ఉండి.. ఇంత అందంగా ఉండి.. ఇంత ఆస్తి ఉండి ..ఎందుకు బోనీకపూర్ ని పెళ్లి చేసుకునింది. అది కూడా రెండో పెళ్లి..? ఆల్రెడీ బోనీకపూర్ కి పెళ్లయిన విషయం అందరికీ తెలిసిందే.. అప్పటికే పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా శ్రీదేవి ఎందుకు బోనీకపూర్ ని పెళ్లి చేసుకుంది ..? అది కూడా పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ వరకు ఎందుకు వెళ్ళింది..? అనేది అభిమానులకి మింగుడు పడని ప్రశ్నగా ఇప్పటికీ మిగిలిపోయింది .
అయితే కొందరు కావాలనే శ్రీదేవి బోనికపూర్ ని ట్రోల్ చేస్తుంటే ..మరి కొందరు ప్రేమ ..ఎప్పుడూ .. ఎవరికీ ఎలా పడుతుందో ఎవ్వరు చెప్పలేరు . దాన్నే ప్రేమ అంటారు . పెళ్లయిన వ్యక్తిపై ప్రేమ పుట్టకూడదని రూల్ లేదుగా ..? శ్రీదేవికి బోనీకపూర్ మనస్తత్వం నచ్చింది..? బోనీ కపూర్ కి శ్రీదేవి నచ్చింది..? ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు .. పెళ్లయిపోయింది . ఇద్దరు పిల్లలు పుట్టారు ..ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన అంటూ శ్రీదేవి ఫాన్స్ పై ట్రోలర్స్ పై మండిపడుతున్నారు . ఏది ఏమైనా సరే శ్రీదేవి మన మధ్య లేకపోవడం నిజంగా సినిమా ఇండస్ట్రీ చేసుకున్న ఓ దురదృష్టమని చెప్పాలి..!!