1980లలో తెలుగు సినిమాలకు ఎక్కడా లేని ఆదరణ ఉంది. అప్పట్లో అగ్ర దర్శకులు.. అగ్రనిర్మాతలు.. ఆచి తూచి వ్యవహరించేవారు. పైగా.. వీరంతా కూడా.. ఉమ్మడి ఏపీలోని కోస్తా.. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు. దీంతో ఎక్కువగా ఏపీ నుంచి వచ్చిన హీరోయిన్లకే.. అవకాశం ఇచ్చేవారనే టాక్ నడిచింది. ఇలాంటి సమయంలో తెలంగాణకు చెందిన ఒక యువతి సినిమాల్లో అవకాశం కోసం.. వెతుకుతున్నారు.
ఆమే.. విజయశాంతి. వాస్తవానికి చెన్నైలోనే పుట్టిన విజయశాంతి.. కుటుంబం ఆమె చిన్నప్పుడే.. హైదరాబాద్‌కు వచ్చేసింది. దీంతో ఆమె తండ్రి, తల్లి.. పట్టిన ఊరు రామగుండంతో విజయశాంతికి ఎంతో అనుబంధం ఏర్పడింది. ఇక, ఆమె ఇండస్ట్రీలో ఎక్కడికి వెళ్లినా మీది ఏవూరు.. అంటే.. ఠక్కున రామగుండం అనే చెప్పేది. కానీ, ఆమెకు అవకాశాలు దొరకలేదు. ఈ క్రమంలోనే దర్శకుడు దాసరి నారాయణరావు .. ఓ సలహా ఇచ్చారట.
అలా కాదు.. చెన్నై అనే చెప్పు. అప్పుడు నీకు అవకాశాలు వాటంతట అవే వస్తాయి. అని! దీంతో విజయ శాంతి ఏకీభవించలేదు. నేను పుట్టిన ఊరు గురించి తెలిసి అవకాశం ఇచ్చినా.. నా నటనకే ప్రాధాన్యం ఇస్తారు కదా.. అని ఆమె తెలంగాణలోనే పుట్టాను అని చెప్పేదట. దీంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో దాసరి తొలి అవకాశం ఇచ్చారు. చూద్దాం.. ఆమె నటన బాగుంటుందేమో.. అని నిర్మాతలను ఒప్పించారు.
ఇలా.. ఇండస్ట్రీలోకి వచ్చిన విజయశాంతి.. అప్పటికి అగ్రతారలుగా ఉన్న జయసుధ, జయప్రద, శ్రీదేవి వంటి వారితో సమానంగా రెమ్యునరేషన్ అందుకునే స్థాయికి ఎదిగింది. విజయశాంతి ఎంట్రీ ఇచ్చాక అప్పటి స్టార్ హీరోయిన్లే ఆమె టాలెంట్ చూసి దడదడలాడిపోయేవారట. ఆమె నటించిన అనేక సినిమాలు కెరీర్‌ను మలుపు తిప్పాయి. గ్యాంగ్ లీడర్, ఒసే రాములమ్మలు అయితే.. బాక్సాఫీస్‌ను దడదడలాడించా యి. ఇలా.. తెలంగాణ నుంచి వచ్చి హీరోయిన్ అయి.. నిలదొక్కుకున్న వారిలో విజయశాంతి తొలి ప్లేస్‌లో ఉన్నారంటే.. ఆశ్చర్యం అనిపించక మానదు.