Movies' విరూపాక్ష ' వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్.. సాయితేజ్...

‘ విరూపాక్ష ‘ వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్.. సాయితేజ్ టార్గెట్ ఎన్ని కోట్లు అంటే..!

మెగా హీరో, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చాలా గ్యాప్ త‌ర్వాత విరూపాక్ష సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. హ‌ర్ర‌ర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ ఇప్ప‌టికే రిలీజ్ అయ్యింది. ట్రైల‌ర్ త‌ర్వాత సినిమాపై ఉన్న హైప్ మ‌రింత పెరిగింది. సాయితేజ్ కెరీర్‌లోనే చాలా డిఫ‌రెంట్‌గా ట్రై చేసిన సినిమా ఇది.

సాయితేజ్ రోడ్డు ప్ర‌మాదం నుంచి కోలుకున్న త‌ర్వాత న‌టించిన సినిమా ఇది. ఈ నెల 21న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. సంయుక్త మీన‌న్ హీరోఇన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే విరూపాక్ష వ‌ర‌ల్డ్ వైడ్ థియేట్రిల‌క్ బిజినెస్ కూడా పూర్తి చేసుకుంది. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విరూపాక్ష‌కు రు. 25 కోట్ల వరకు మూవీ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

నైజాంలో 7.20 కోట్ల‌కు – విశాఖపట్నం 2.25 కోట్లు – ఈస్ట్ 1.45 కోట్లు – వెస్ట్ 1.25 కోట్లు – కృష్ణ 1.45 – గుంటూరు 1.65 – నెల్లూరు 70 లక్షలు – సీడెడ్ 3.85 కోట్లు మేరకు బిజినెస్ జరిగింది. క‌ర్నాట‌క‌లో 1.0 కోటి – రెస్ట్ ఆఫ్ ఇండియాలో 0.50 – ఓవర్సీస్ లో 1.5 కోట్ల బిజినెస్ జరగడం విశేషం. ఓవరాల్ గా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రు. 25 కోట్ల థియేట్రిక‌ల్ బిజినెస్ జ‌రిగింది. అంటే ఈ సినిమాకు రు. 26 కోట్ల షేర్ వ‌స్తేనే సినిమా హిట్ అయిన‌ట్టు లెక్క‌.

ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆక‌ట్టుకోవ‌డంతో సినిమా ఓపెనింగ్స్‌కు అయితే ఎలాంటి డోకా లేద‌ని అర్థ‌మ‌వుతోంది. త‌ర్వాత‌ మూవీ ఎలాంటి టాక్ సొంతం చేసుకొని ప్రజలలోకి వెళుతుంద‌నేది చూడాలి. సాయితేజ్ చివ‌రి సినిమా రిప‌బ్లిక్ మంచి టాక్ వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా స‌క్సెస్ కాలేదు. మ‌రి విరూపాక్ష‌తో అయినా మంచి హిట్ త‌న ఖాతాలో వేసుకుంటాడేమో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news