దివ్యభారతి 1990వ దశకంలో అటు బాలీవుడ్.. ఇటు టాలీవుడ్‌ను తన అందచందాలతో ఒక ఊపు ఊపేసింది. దివ్యభారతి నాలుగైదు సంవత్సరాల్లోనే ఇండియన్ సినిమాను షేక్ చేసి పడేసింది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో ఎందరో స్టార్ హీరోలతో కలిసి నటించింది. అప్పట్లో దివ్యభారతి ఒక సంచలనం.. యువకుల ఆరాధ్య దేవత. అలాంటి దివ్యభారతి చిన్న వయసులోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు
బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియద్ వాలను ప్రేమ వివాహం చేసుకున్న ఏడాదికే దివ్యభారతి తమ అపార్ట్మెంట్లో మూడో అంతస్తు నుంచి కిందపడి మృతి చెందారు. ఆమె మరణం అప్పట్లో దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. ఆమె తెలుగులోనూ మోహన్ బాబు – బాలకృష్ణ – వెంకటేష్ – చిరంజీవి – ప్రశాంత్ లాంటి హీరోలకు జోడిగా నటించి హిట్లు కొట్టింది. ఆమె చివరి సినిమా ప్రశాంత్ హీరోగా వచ్చిన తొలిముద్దు.
ఇదిలా ఉంటే టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ దివ్యభారతిను బాగా ఇష్టపడేవారు అన్న ప్రచారం అప్పట్లో ఉంది. దివ్యభారతి – వెంకటేష్ కాంబినేషన్లో బి.గోపాల్ దర్శకత్వంలో బొబ్బిలి రాజా ( 1990 ) సినిమా వచ్చింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. ఈ సినిమా తర్వాత మరోసారి దివ్యభారతితో ఒక మంచి సినిమా చేయాలి అని వెంకటేష్ ప్రయత్నాల్లో ఉన్నారు. ఆ సమయంలోనే ఆమె ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
దివ్యభారతి మృతి చెందిన విషయం తెలుసుకున్న వెంకటేష్ ఆగమేఘాలమీద ముంబై వెళ్ళి మరి ఆమెకు నివాళులు అర్పించారని అంటారు. బొబ్బిలి రాజా షూటింగ్ టైంలో అడవుల్లో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎన్నోసార్లు దివ్యభారతి భయపడుతుంటే.. ఆమె చేయి పట్టుకుని మరి లాగుతూ వెంకటేష్ ఆటపట్టించేవాడట.
మరోవైపు దివ్యభారతి అడవుల్లో ఏదైనా శబ్దాలు వస్తే వెంటనే వెంకటేష్‌ను గట్టిగా వాటేసుకునేదట. ఇదంతా సినిమా షూటింగ్లో భాగంగా జరిగినా వెంకటేష్ దివ్యభారతిని ఇష్టపడే వాడని… అందుకే ఆమెను సరదాగా ఆటో పట్టించేవాడని టాలీవుడ్ లో గుసగుసలు అయితే ఉన్నాయి. అప్పటికే వెంకటేష్‌కు పెళ్లయ్యి పిల్లలు కూడా ఉన్నారు.