అఫ్కోర్స్ జెలసి ఫీలింగ్ ఎవరికైనా ఉంటుంది . పక్క వాళ్ళు బాగుపడుతూ ఉంటే .. చూసి తట్టుకోలేని మనుషులు చాలామంది ఉంటారు . పక్కవాడికి ప్రమోషన్ వచ్చిన ఇంక్రిమెంట్లు వచ్చినా.. పక్క ఉద్యోగులు చూసి కుళ్ళుకున్న ఏడ్చే టైపు . వాడు నాశనం అవ్వాలి అని కోరుకునే రకాలు కూడా ఉంటారు . అయితే ఇవి కామన్ గా సామాన్య ప్రజలే అనుకుంటారా ..? అంటే కాదని చెప్పాలి .సినిమా ఇండస్ట్రీలో పాన్ ఇండియా లెవెల్ లో ఉన్న హీరోలు కూడా ఇదే విధంగా థింక్ చేస్తూ ఉంటారు అంటూ మరోసారి ప్రూవ్ అయింది .
ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న స్టార్ సన్ మూర్ఖుడుగా పెట్టింది పేరు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్లు అని చెప్పే రకం ఈ హీరో అంటూ జనాలు మొదటినుంచి చెప్పుకొస్తూ ఉంటారు . డబ్బులు ఇచ్చి మరి తన పేరుని పబ్లిసిటీ చేయించుకునే హీరో . ఇండస్ట్రీలో చాలా తక్కువ సినిమాలు మాత్రమే చేసాడు. బోలెడు పబ్లిసిటీ చేసారు. తీసిన ప్రతి సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఈ హీరో కెరియర్ లోనే రికార్డ్ .
మరీ ముఖ్యంగా తన పేరు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న సరే .. తనకు తానే పోటీ అని చెప్పుకునే టైపు ఈ హీరో . రీసెంట్గా ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి హిట్ అందుకుందో తెలిసిందే. ఏకంగా ఆస్కార్ అవార్డు తెచ్చిపెట్టి.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే కొత్త రికార్డును నెలకొల్పింది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో మాత్రం చాలా సింపుల్ గా రాజమౌళి నాతో సినిమా తీయనంటున్నాడు అంటూ గందర గోలం చేస్తాడట . ” నా సినిమా హిట్ అవ్వకపోయినా పర్లేదు .. పక్కన వాడి సినిమా హిట్ అవ్వకూడదు అంటూ చెప్పే టైప్.. ఈ తెలుగు హీరో” అంటున్నారు జనాలు . ఇప్పటికే ఈ హీరో ఎవరో మీకు అర్థమయిపోయింది అనుకుంటాను..!!